https://oktelugu.com/

Hair Health: జుట్టును స్ట్రెయిటనింగ్ చేస్తున్నారా? అయితే కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

స్ట్రయిటినింగ్ చేయడం వల్ల వల్ల మీ జుట్టుకు సమస్యలు వస్తాయి. దీని వల్ల జుట్టుని స్టైల్ చేయడం కష్టం. జుట్టు త్వరగా ఆరదు కదా. దీని వల్ల జుట్టు బ్రేక్ అవుతుంటుంది కూడా. డ్రైగా మారి గడ్డకట్టినట్లుగా కనిపిస్తుంటుంది కాబట్టి ఆందోళన చెందుతుంటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 14, 2024 / 12:00 PM IST

    Hair Health

    Follow us on

    Hair Health: జుట్టు అందంగా కనిపించాలి అని ఎవరికి ఉండదు చెప్పండి. దీని కోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తారు. అయితే ఒకప్పుడు హీరోయిన్స్, సెలబ్రిటీలు మాత్రమే జుట్టుని స్లైల్ గా చేయించుకునేవారు..ముఖ్యంగా స్ట్రెయిటనింగ్, కర్లీ వంటి స్టైల్స్ చేయించుకునేవారు. కానీ, ఫ్యాషన్ ట్రెండ్స్ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో చాలా మంది ఇంట్లోనే స్ట్రెయిట్నర్ వాడి జుట్టుని అందంగా మార్చుకుంటున్నారు.దీని వల్ల జుట్టు పొడవుగా కనిపిస్తుంది. చూడ్డానికి చక్కగా ఉంటుంది కూడా. అయితే, అందం కోసం రెగ్యులర్‌గా స్ట్రెయిటనింగ్ చేస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటున్నారు నిపుణులు. దీని వల్ల జుట్టు పాడవుతుంది. అంతేకాదు మరెన్నో సమస్యలు కూడా వస్తాయట. మరి అవేంటో తెలుసుకోండి.

    స్ట్రయిటినింగ్ చేయడం వల్ల వల్ల మీ జుట్టుకు సమస్యలు వస్తాయి. దీని వల్ల జుట్టుని స్టైల్ చేయడం కష్టం. జుట్టు త్వరగా ఆరదు కదా. దీని వల్ల జుట్టు బ్రేక్ అవుతుంటుంది కూడా. డ్రైగా మారి గడ్డకట్టినట్లుగా కనిపిస్తుంటుంది కాబట్టి ఆందోళన చెందుతుంటారు. అదే విధంగా, రెగ్యులర్‌గా స్ట్రెయిటనింగ్ చేస్తే జుట్టు దెబ్బతినే అవకాశం ఎక్కువ. స్ట్రెయిటనింగ్ చేసినప్పుడు జుట్టు పొడుగ్గా కనిపించినా జస్ట్ ఇది టెంపరరీ మాత్రమే. రెగ్యులర్‌గా వాడితే జుట్టు దెబ్బతినడమే కాదు పాడవుతుంది కూడా.

    స్ట్రెయిటనింగ్ చేస్తే జుట్టు పొడిబారి చుండ్రు, అలర్జీ సమస్యలు వస్తుంటాయి. కొందరికీ జుట్టు పెరుగుదల ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. స్ట్రెయిటనింగ్ చేసినప్పుడు కొన్ని కెమికల్స్ వాడుతుంటారు. దీని వల్ల మీ స్కాల్ప్ దెబ్బతినే అవకాశం కూడా ఎక్కువే. దీనిని సరిగ్గా వాడకపోతే అది స్కాల్ప్ హెల్త్, జుట్టు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది అంటున్నారు నిపుణులు.

    ఫార్మాల్డిహైడ్.. అంటే ఇదొక కార్సినోజెన్. ఇది ఎక్కువగా స్ట్రెయిటనింగ్ సొల్యూషన్స్‌లో తెలుస్తుంటుంది. ఈ ఫార్మాల్డిహైడ్ పొగని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, చర్మం, కంటి సమస్యలు, రొమ్ము క్యాన్సర్స్ వస్తాయి. అందుకే, వీటిని వాడేటప్పుడు జాగ్రత్త పడాలి. లేదంటే డాక్టర్‌ని సంప్రదించిన తర్వాత వాడటం మంచిది.

    హెయిర్ స్ట్రెయిటనర్ కెమికల్స్ రెగ్యులర్‌గా వాడడం వల్ల క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. యూటెరిన్ క్యాన్సర్, ఫ్రైబ్రాయిడ్స్, బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియోసిస్ ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది.. ఈ స్ట్రెయిటనింగ్ సొల్యూషన్స్ కారణంగా దీర్ఘకాలిక సమస్యలు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు నిపుణులు. ముందుగా ఇలాంటివి ఎక్కువగా ఎవరు గమనించలేరు. జుట్టు రెగ్యులర్‌గా స్ట్రెయిటనింగ్ చేయడం మంచిది కాదు. స్ట్రెయిటనింగ్ చేసే ముందు హెయిర్ ప్రొటెక్టర్ క్రీమ్ వాడటం వల్ల జుట్టుకు పెద్దగా సమస్య రాదు. దీని వల్ల హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. కొంతమంది తడి జుట్టుపై స్ట్రెయిటనర్ వాడుతుంటారు. దీని వల్ల జుట్టుపై ఎఫెక్ట్ పడటం కూడా ఎక్కువే. అలా కాకుండా జుట్టు ఆరిన తర్వాత స్ట్రెయిట్ చేస్తే కాస్త నష్టాన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.