భగవాన్ శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైద్య చికిత్స చేయించుకోవడానికి స్థానిక ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు సైతం వస్తారు. ఈ ఆస్పత్రిలో వైద్య సేవలతో పాటు వైద్య పరీక్షలు సైతం ఉచితం కావడం గమనార్హం. తల్లి ఈశ్వరాంబ కోరిక మేరకు సత్యసాయి ఈ ఆస్పత్రిని నిర్మించారు. రోజురోజుకు ఈ ఆస్పత్రిలో చికిత్స చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
అందువల్ల ఈ ఆస్పత్రి సేవలను మరింత విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు 300 కోట్ల రూపాయల ఖర్చుతో 110 ఎకరాల్లో 9 నెలల్లో ఈ ఆస్పత్రిని నిర్మించడం జరిగింది. ఈ ఆస్పత్రిలో ఉచిత వైద్య సేవలు పొందలని అనుకునేవాళ్లు మొదట ఉచితంగా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్ కు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఆస్పత్రి ఉండటం గమనార్హం.
గుర్తింపు కార్డును కలిగి ఉంటే మాత్రమే వైద్య చికిత్స చేయించుకోవడం సాధ్యమవుతుంది. www.psg.sssihms.org.in వెబ్ సైట్ ద్వారా ఆస్పత్రికి సంబంధించిన, వైద్య చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియాల్సి ఉంది.