https://oktelugu.com/

వామ్మో.. దేశంలో అంతమందికి కరోనా సోకుతుందట..?

భారత్ లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దేశంలో ప్రతిరోజూ 50,000 లోపు కరోనా కొత్త కేసులు, వెయ్యి లోపు మరణాలు నమోదవుతున్నాయి. అయితే దేశంలో చాలామందికి కరోనా సోకినా లక్షణాలు కనిపించక పోవడం వల్ల కరోనా సోకలేదని అనుకుంటున్నారు. అయితే శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ అధ్యయనం ప్రకారం దేశంలో 7.43 కోట్ల మంది ఆగష్టు నాటికే కరోనా బారిన పడ్డారు. Also Read: ఆ రెండు లక్షణాలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 28, 2020 / 06:15 AM IST
    Follow us on


    భారత్ లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దేశంలో ప్రతిరోజూ 50,000 లోపు కరోనా కొత్త కేసులు, వెయ్యి లోపు మరణాలు నమోదవుతున్నాయి. అయితే దేశంలో చాలామందికి కరోనా సోకినా లక్షణాలు కనిపించక పోవడం వల్ల కరోనా సోకలేదని అనుకుంటున్నారు. అయితే శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ అధ్యయనం ప్రకారం దేశంలో 7.43 కోట్ల మంది ఆగష్టు నాటికే కరోనా బారిన పడ్డారు.

    Also Read: ఆ రెండు లక్షణాలు కనిపిస్తే కరోనా వైరస్ సోకినట్లే..?

    ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉన్నవాళ్లలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం లేదని వాళ్లు చికిత్స చేయించుకోకపోయినా ఇమ్యూనిటీ వల్ల కోలుకున్నారని సమాచారం. లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ మన దేశంలో దాదాపు 50 శాతం మందికి కరోనా వైరస్ సోకనుందని ఈ సంస్థ వెల్లడించింది. నగరాల్లోనే ఎక్కువ మంది కరోనా వైరస్ బారిన పడ్డారని జనసాంద్రత ఎక్కువగా ఉండటమే అందుకు కారణమని తెలిపింది.

    Also Read: ప్రజలకు షాకింగ్ న్యూస్.. వెలుగులోకి కరోనా కొత్త లక్షణాలు..?

    10 సంవత్సరాలు దాటిన ప్రతి పదిహేను మందిలో ఒకరికి కరోనా సోకినట్టు ఈ అధ్యయనంలో తేలింది. అయితే అంతమందికి కరోనా సోకినా చాలామందిలో లక్షణాలు కనిపించడం లేదని పేర్కొంది. ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ వస్తే మాత్రమే కరోనాను కట్టడి చేయడం సాధ్యామవుతుందని అప్పటివరకు వైరస్ విజృంభణ కొనసాగుతుందని కేంద్రం వెల్లడించింది. చాలామందిలో యాంటీబాడీలు ఉండటం వల్ల లక్షణాలు కనిపించడం లేదని సంస్థ వెల్లడించింది.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    మరోవైపు దేశంలోని ప్రజలకు అతి త్వరలో కరోనా వ్యాక్సిన్ లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రష్యా దేశానికి చెందిన కరోనా వ్యాక్సిన్ 95 శాతం ప్రభావం చూపుతుందని.. భారత్ లో ఈ వ్యాక్సిన్ ను సంవత్సరానికి 10 కోట్ల డోసుల చొప్పున ఉత్పత్తి చేయనున్నారని సమాచారం.