Spoiled Coconut: మనలో చాలామంది కొబ్బరి కాయ కుళ్లిపోతే చెడు జరుగుతుందని నమ్ముతారు. మరి నిజంగానే కొబ్బరి కాయ కుళ్లిపోతే ఇబ్బందులు తప్పవా? అనే ప్రశ్నకు పండితులు మాత్రం కొబ్బరికాయ కుళ్లిపోయినంత మాత్రాన ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదని చెబుతున్నారు. మనం కొబ్బరికాయను ఎంత భక్తితో సమర్పించాం అనేది మాత్రమే ముఖ్యమని పండితులు వెల్లడిస్తున్నారు.
పూజలు చేసే సమయంలో దేవునికి నైవేద్యంగా మనలో చాలామంది కొబ్బరికాయను కొడతారు. మనకు అన్నీ శుభ ఫలితాలు కలగాలని కొబ్బరికాయ కొట్టి మనస్సులో ఉన్న కోరికలను నెరవేర్చాలని చాలామంది కోరుకుంటారు. అయితే కొబ్బరికాయ కుళ్లిపోతే మాత్రం ఏదైనా నెగిటివ్ గా జరుగుతుందనే ఆలోచన మనలో చాలామందిని వెంటాడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
కొబ్బరికాయ కుళ్లిపోతే తాము కోరుకున్న కోరికలు నెరవేరవని ఇబ్బందులు ఎదురవుతాయని మరి కొందరు అనుకుంటూ ఉంటారు. కొబ్బరికాయ కుళ్లిపోతే వెంటనే కాళ్లూచేతులను శుభ్రంగా కడుక్కుని పూజగదిలో లేదా దేవుని గుడిలో కొంత సమయం ధ్యానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మాత్రం శుభ ఫలితాలు కలిగే ఛాన్స్ ఉంటుందని అర్థం చేసుకోవాలి.
కొబ్బరికాయ కుళ్లిపోయిందని టెన్షన్ పడితే మాత్రం నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు. పెళ్లైన దంపతులకు కొబ్బరికాయ కొట్టిన సమయంలో పువ్వు వస్తే మాత్రం త్వరగా పిల్లలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు కొబ్బరికాయ ఎంపికలో చేసిన తప్పు చేస్తే కూడా ఈ విధంగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయని గుర్తుంచుకోవాలి.