https://oktelugu.com/

Sleeping: ఉదయం 3 నుంచి 5 గంటల లోపు మెలకువ వస్తుందా? అయితే మీరు తప్పక చదవాల్సిందే

పూర్వీకులు చీకటి తొలగకముందే నిద్రలేచేవారు. ఉదయం పనులన్నీ సూర్యోదయానికి ముందే చేసేవారు. ఆ తరువాత ఎవరి పనులకు వారు వెళ్లేవారు. సాయంత్రం 7 గంటల తరువాత ఎవరూ మెళకువ ఉండేవారు కాదు.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 6, 2023 / 04:44 PM IST
    Follow us on

    Sleeping: సాధారణంగా ప్రతి ఒక్కరు ఉదయం 5 గంటలకు లేస్తారు. కాస్త బద్ధకం ఉన్న వారు 9 నుంచి 10 గంటలకు నిద్ర లేస్తారు. ఇక రాత్రిళ్లు ఎక్కువ సేపు మెలకువ ఉన్నవారు మధ్యాహ్నం వరకు మంచం వీడరు. సమయ పాలన లేకుండా నిద్ర లేవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఉద్యోగం చేసేవారు ఉదయం 6 గంటల లోపు లేవకుండా ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. స్కూలుకెళ్లే వారు కనీసం 6 గంటల వరకు నిద్రలేవాలి. అయితే చాలా మందికి రాత్రిళ్లు నిద్ర సరిగా పట్టదు. ఒకవేళ నిద్ర పోయినా ఉదయం 3 నుంచి 5 గంటల వరకు మెళకువ వస్తుంది.ఇది ఎప్పటికీ కాకపోయినా అప్పుడప్పుడు జరుగుతంది. అలా జరగడానికి కారణం ఏంటో తెలుసా?

    పూర్వీకులు చీకటి తొలగకముందే నిద్రలేచేవారు. ఉదయం పనులన్నీ సూర్యోదయానికి ముందే చేసేవారు. ఆ తరువాత ఎవరి పనులకు వారు వెళ్లేవారు. సాయంత్రం 7 గంటల తరువాత ఎవరూ మెళకువ ఉండేవారు కాదు. దీంతో అప్పటి వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా వందేళ్ల వరకు జీవించగలిగారు. కానీ నేటి కాలంలో చాలా మంది ఉదయం 7 తరువాత కానీ లేవడం లేదు. సూర్యుడు వచ్చిన తరువాతే నిద్ర నుంచి తేరుకుంటున్నారు.

    కొందరికి కొన్ని కారణాల వల్ల రాత్రిళ్లు నిద్ర పట్టదు. మరికొందరు చాలా లేటుగా పడుకోవడం వల్ల మధ్యలోనే మెళకువ అవుతుంది. అయితే ఉదయం 3 నుంచి 5 గంటల లోపు మెళకువ వచ్చే వారి జీవితంలో విశేషాలు జరుగుతాయని కొందరు ఆధ్యాత్మిక వాదులు పేర్కొంటున్నారు. ఉదయం 3 నుంచి 5 గంటల కాలాన్ని బ్రహ్మమహూర్తం అంటారు. ఈ సమయంలో దేవాలయాలు తెరిచి దేవుళ్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. మనుషులు కూడా ఈ సమయంలో నిద్ర లేచి తమ పనులు చేయడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

    అయితే అనుకోకుండా ఉదయం 3 నుంచి 5 గంటల లోపు మెళకువ వచ్చేవారికి త్వరలో వారి సంపద వృద్ధి చెందుతుందని అర్థం. అప్పటి నుంచి వారి జీవితం మారిపోతుంది. ఈ సమయంలో వారికి అప్రమత్తం చేయడానికే మెళకువ చేస్తారని కొందరు చెబుతున్నారు. ఈ సమయంలో అనుకోకుండా మెళకువ రాకున్నా నిద్ర లేని పూజలుచేయడం వల్ల అనుకున్నవన్నీ నెరవేరుతాయని కొందరు అంటున్నారు. అందువల్ల సూర్యోదయానికి ముందే లేచే అలవాటు చేసుకోవడం చాలా మంచిది.