https://oktelugu.com/

Best Cars: 27 కి.మీ మైలేజీ.. 5 స్టార్ రేటింగ్.. దీపావళి ఈ మూడు బెస్ట్ కార్లను వెంటనే బుక్ చేసుకోండి

దీపావళి సందర్భంగా కారు కొనాలనుకునేవారికి మూడు మోడళ్లు అత్యంత బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చని ఆటోమోబైల్ రంగంలో చర్చ సాగుతుంది. ఇవి 5 స్టార్ రేటింగ్ పొందినవే కాకుండా తక్కువ ధరకు లభించే బెస్ట్ మోడళ్లు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 6, 2023 / 04:38 PM IST
    Follow us on

    Best Cars: ప్రతీ పండుగ సీజన్ లో కొత్త వాహనం కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటారు. ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా చాలా మంది కొత్త వాహనాలు ఇంటికి తెచ్చుకోవాలని ఆశిస్తారు. ఈనేపథ్యంలో కంపెనీలు కూడా కొన్ని ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. అంతేకాకుండా బెస్ట్ కార్లపై తక్కువ ధరను ప్రకటిస్తూ ఉంటాయి. ఈ దీపావళి సందర్భంగా కారు కొనాలనుకునేవారికి మూడు మోడళ్లు అత్యంత బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చని ఆటోమోబైల్ రంగంలో చర్చ సాగుతుంది. ఇవి 5 స్టార్ రేటింగ్ పొందినవే కాకుండా తక్కువ ధరకు లభించే బెస్ట్ మోడళ్లు. మరి ఈ కార్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?

    మారుతి సుజుకీ నుంచి చాలా మోడళ్లు ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే వాటిలో కొన్న కార్లపై దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను కేటాయించారు. వీటిలో మారుతి సుజుకీ బ్రెజ్జా ఒకటి. 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉన్న SUV కాంపాక్ట్ కారు ఇది. పెట్రోల్ వేరియంట్ లో 19.1 కిలోమీటర్లు, సీఎన్ జీ వేరియంట్ లో 25.51 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. గ్లోబల్ ఎన్ సీ ఏపీ దీనికి 5 స్టార్ రేటింగ్ ఇచచింది. అత్యంత అప్డేట్ ఫీచర్లతో కూడిన ఈ కారును రూ.8.29 లక్షలకే ఇవ్వనున్నారు.

    దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ దూసుకుపోతుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా ఎక్స్ టర్ బెస్ట్ మోడల్ గా నిలిచింది. 1.2 లీటర్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ తో పాటు 81 బీహెచ్ పీ పవర్, 114 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు పెట్రోల్ వేరియంటఖ్ లో 19.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్ జీ వేరియంట్ లో 27.1 కిలో మీటర్ల వరకు దూసుకుపోతుంది. దీనిని రూ.6 లక్షల నుంచి విక్రయిస్తున్నారు. బెస్ట్ ఎస్ యూవీ అయిన ఇందులో అప్డేట్ ఫీచర్స్ ఉన్నాయి.

    బెస్ట్ ఫీచర్స్ తో పాటు సేప్టీ కారుగా గుర్తింపు తెచ్చుకుంది టాటా పంచ్. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే కలిగి ఉన్న ఇందులో 88 బీహెచ్ పీ పవర్, 115 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో ఉన్న ఈ కారులో ఇటీవలే సీఎన్ జీ ని అమర్చారు. ఈ కారు లీటర్ కు 20.09 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్ జీలో 26.99 కిలోమీటర్ల వరకు దూసుకుపోతుంది. దీనిని 9.52 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.