పాలు తాగడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. పాలు పౌష్టికాహారం అని వైద్య నిపుణులు సైతం చెబుతూ ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో పాలు ఎంతగానో సహాయపడతాయి. అయితే కల్తీ పాలు తాగితే మాత్రం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. కల్తీ పాలు రోజూ తాగితే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు సైతం ఉంటాయని తెలుస్తోంది.
నిత్య జీవితంలో పాలు, పాల పదార్థాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కలుషిత పాలు తాగితే ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుందని చెప్పవచ్చు. పశువులు తినే ఆహారంలో సైతం కల్తీ జరుగుతుండటం గమనార్హం. పశువులు పాలు ఎక్కువగా ఇవ్వడానికి వాడుతున్న మందుల వల్ల కూడా పాలలోని ప్రోటీన్లు నాశనమవుతుండటం గమనార్హం. చక్కెర, యూరియా, మంచినూనె, సర్ఫ్ తో కొంతమంది కృత్తిమంగా పాలను తయారు చేస్తున్నారు.
పాలను పరీక్షించి చూడటం ద్వారా అవి కల్తీ పాలా..? కాదా..? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సర్ఫ్ ను కలపడం వల్ల తెల్లగా, స్వచ్ఛంగా పాలు కనిపించే అవకాశాలు ఉంటాయి. యూరియా కలిపిన పాలను తాగితే కిడ్నీల పనితీరుపై ఆ ప్రభావం పడుతుంది. పాల స్వచ్ఛతను ఎక్కువ కాలం కాపాడేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ ను సైతం కలుపుతారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల జీర్ణసంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల కడుపులో మంట, అల్సర్ సమస్యలు కూడా వస్తుంటాయి. స్టార్చ్ కలపడం వల్ల పాలు చిక్కగా కనిపించడంతో పాటు ఈ పాల వల్ల డయేరియా బారిన పడే అవకాశం ఉంటుంది. కల్తీ పాలు తాగితే ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.