Cigarette
Cigarette : సింగరెట్(Cigarette) తాగితే ముందు పొగ వస్తుంది… కొన్ని రోజులకు తాగేవారికి క్యాన్సర్ వస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. పొగతాగడం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. తాగేవారు ఈవిషంయ నిత్యం చదువుతారు కూడా. అయినా పాతవారు అలవాటు కొనసాగిస్తుండగా, కొత్తవారు యాడ్ అవుతున్నారు. మన దేశంలో 12 కోట్ల(12 Cros) మంది సిగరెట్ తాగుతారని అంచనా. అయితే వీరు తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూనే.. ప్రజల ఆరోగ్యానికి హానికలిగిస్తున్నారు. తాగి పడేసిన సిగరెట్ పీకలు నీటిలో కలిసి విషపూరితమైన రసాయనాలను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ముందుకు వచ్చాడు నోయిడాకు చెందిన నమన్‌గుప్తా(Naman Guptha). ఒక పరిశ్రమను స్థాపించి తాగి పడేసిన సిగరెట్ పీకలతో అనేక పర్యావరణ హిత ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఇది ఒక సృజనాత్మక ఆలోచన. సిగరెట్ బట్స్ (cigarette butts) ప్రపంచంలో అత్యంత సాధారణంగా వేయబడే వ్యర్థాలలో ఒకటి. వీటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా అనేక ఉపయోగకరమైన ఉత్పత్తులను సృష్టించవచ్చు.
Also Read : సింపుల్ గా మీ భాగస్వామిని సిగిరెట్ మాన్నించండి..
సిగరెట్ బట్స్‌లోని ప్రధాన భాగం సెల్యులోజ్ ఎసిటేట్ (cellulose acetate), ఒక రకమైన ప్లాస్టిక్, ఇది సహజంగా కుళ్ల్ళిపోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ వ్యర్థాలను సేకరించి, వాటిని ప్రాసెస్ చేయడం ద్వారా వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయవచ్చు.
ప్లాస్టిక్ ఉత్పత్తులు: సిగరెట్ ఫిల్టర్ల నుంచి సెల్యులోజ్ ఎసిటేట్‌ను వేరు చేసి, దానిని కరిగించి, షిప్పింగ్ ప్యాలెట్లు, ఫ్రిస్బీలు, యాష్‌ట్రేలు వంటి పారిశ్రామిక ప్లాస్టిక్ వస్తువులను తయారు చేయవచ్చు.
సాఫ్ట్ టాయ్స్, కుషన్లు: భారతదేశంలోని కొన్ని సంస్థలు సిగరెట్ బట్స్‌ను శుద్ధి చేసి, వాటిని సాఫ్ట్ టాయ్స్ లేదా కుషన్లలో ఫిల్లింగ్ మెటీరియల్‌గా ఉపయోగిస్తున్నాయి.
మొక్కల ఎరువు: సిగరెట్‌లోని అవశేష పొగాకు,కాగితాన్ని కంపోస్ట్ చేసి సేంద్రియ ఎరువుగా మార్చవచ్చు.
నిర్మాణ సామగ్రి: ఆస్ట్రేలియాలోని రీసెర్చర్లు సిగరెట్ బట్స్‌ను ఇటుకలు మరియు ఆస్ఫాల్ట్ తయారీలో వినియోగిస్తున్నారు, ఇది వాటి థర్మల్ కండక్టివిటీని తగ్గించి, శక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.
పేపర్ ఉత్పత్తి: ఫిల్టర్ల నుంచి సేకరించిన సెల్యులోజ్‌ను శుద్ధి చేసి, పేపర్ తయారీకి ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియలో, సిగరెట్ బట్స్‌లోని విషపూరిత పదార్థాలను తొలగించడం కీలకం. భారతదేశంలో ‘కోడ్ ఎఫర్ట్‘ వంటి సంస్థలు వీటిని సేకరించి, శుద్ధి చేసి, మరలా ఉపయోగపడే వస్తువులుగా మార్చుతున్నాయి. ఈ విధానం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, సుస్థిర అభివృద్ధికి దోహదపడుతుంది.
Also Read : సిగరెట్ తాగుతున్నారా? దాన్ని తయారీ తెలిస్తే జన్మలో తాగరు
Web Title: So many products made from cigarette butts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com