Panipuri : పానీపూరీ భారతీయులు ఎక్కువగా ఇష్టపడే స్ట్రీట్‌ఫుడ్‌లో ఇదీ ఒకటి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చిన చిరు వ్యాపారులు పారీపూరీ(Panipuri)ని మనకు అలవాటు చేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ, పానీపూరీపై తరచూ ఆరోపణలు వస్తున్నాయి. పానీపూరి విక్రేత చింతపండు రంసలోనే చేతులు కడగడం, చెమట అదే కండలో పడడం వంటి వీడియోలు అప్పట్లో వచ్చాయి. అయితే తాజాగా పానీపూరీలో విషపూరిత రసాయనాలు కూడా ఉన్నట్లు తేలింది. తమిళనాడు, కర్ణాటకలో ఆహార భద్రతా అధికారులు పానీపూరి నమూనాలను పరీక్షించినప్పుడు, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు (carcinogenic substances) ఉన్నట్లు తేలింది. ఈ రసాయనాలు సాధారణంగా కృత్రిమ రంగులు (artificial colors) లేదా సంరక్షణ పదార్థాల (preservatives) రూపంలో ఉంటాయి, ఇవి రుచి, ఆకర్షణ పెంచడానికి వాడతారు.
Also Read : పానీపూరీ తినేవారికి ఇది హెచ్చరిక
క్యాన్సర్ కారక రసాయనాలు..
కర్ణాటకలో 2024లో జరిపిన పరీక్షల్లో, పానీపూరి నీటిలో లేదా పూరీలలో కొన్ని నిషేధిత రంగులు (Rhodamine-B, Tartrazine), హానికరమైన రసాయనాలు కనుగొనబడ్డాయి. ఈ పదార్థాలు ఎక్కువ కాలం తీసుకుంటే క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్య ప్రమాదాలు: ఈ రసాయనాలు కేవలం క్యాన్సర్‌తోనే కాకుండా, గర్భిణులకు పుట్టబోయే శిశువు నరాల వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. జన్యు పరివర్తనలకు (genetic mutations) కూడా కారణమవుతాయి.
పరిశుభ్రత సమస్యలు: వీధి బండ్లపై తయారయ్యే పానీపూరీలో కలుషిత నీరు లేదా అపరిశుభ్రమైన పదార్థాల వాడకం కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది, అయితే ఇది నేరుగా క్యాన్సర్‌కు కారణం కాకపోవచ్చు.
అందరికీ వర్తిస్తుందా?
పానీపూరి తినడం వల్ల నేరుగా క్యాన్సర్ వస్తుందని చెప్పలేము. ఇది ఎక్కువగా ఆహారం తయారీలో వాడే పదార్థాల నాణ్యత. పరిశుభ్రతపై ఆధారపడి ఉంటుంది. ఇంట్లో శుభ్రంగా తయారు చేసిన పానీపూరి లేదా నమ్మకమైన దుకాణాల నుండి తీసుకున్నది సాధారణంగా సురక్షితం. వీధి ఆహారంలో నాణ్యత నియంత్రణ లేనప్పుడు మాత్రమే ప్రమాదం పెరుగుతుంది.
జాగ్రత్తలు:
– పానీపూరి తినేటప్పుడు నీటి రంగు అసహజంగా (చాలా ఎరుపు లేదా పసుపు) ఉంటే అనుమానించండి.
– పరిశుభ్రమైన ప్రదేశాల నుండి మాత్రమే కొనండి.
– అతిగా వీధి ఆహారం తినడం మానేయండి,
– ముఖ్యంగా నాణ్యతపై సందేహం ఉంటే ఫుడ్ సేఫ్టీ అధికారులకు పిర్యాదు చేయాలి.
Also Read : ఈ అలవాట్లు మానకపోతే 30 సంవత్సరాల మీ బ్రెయిన్ కూడా 60 సంవత్సరాల మాదిరి అవుతుంది.