https://oktelugu.com/

గురక సమస్య వేధిస్తోందా.. ఆ అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్..?

మనలో చాలామందిని గురక సమస్య వేధిస్తూ ఉంటుంది. అయితే చాలామంది గురకను పెద్దగా లెక్క చెయ్యరు. కానీ వైద్య నిపుణులు మాత్రం గురక అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతం అని చెబుతున్నారు. ఎప్పుడో ఒకసారి గురక సమస్య వేధిస్తే తప్పు లేదు కానీ తరచూ ఆ సమస్య వేధిస్తుంటే మాత్రం ప్రమాదమేనని చెబుతున్నారు. గురక ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు. Also Read: నిద్రలేమి వల్ల కలిగే ప్రమాదకర ఆరోగ్య సమస్యలివే..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 23, 2020 / 08:16 AM IST
    Follow us on


    మనలో చాలామందిని గురక సమస్య వేధిస్తూ ఉంటుంది. అయితే చాలామంది గురకను పెద్దగా లెక్క చెయ్యరు. కానీ వైద్య నిపుణులు మాత్రం గురక అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతం అని చెబుతున్నారు. ఎప్పుడో ఒకసారి గురక సమస్య వేధిస్తే తప్పు లేదు కానీ తరచూ ఆ సమస్య వేధిస్తుంటే మాత్రం ప్రమాదమేనని చెబుతున్నారు. గురక ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు.

    Also Read: నిద్రలేమి వల్ల కలిగే ప్రమాదకర ఆరోగ్య సమస్యలివే..?

    గురక సమస్య ఉందని తెలిసిన వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. జలుబు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లను ఎక్కువగా గురక సమస్య వేధిస్తూ ఉంటుంది. పొగ తాగే అలావాటు ఉన్నవాళ్లలో శ్వాస సంబంధిత సమస్యల వల్ల కూడా గురక సమస్య వేధించే అవకాశం ఉంటుంది. పడుకునే సమయంలో సరిగ్గా పడుకోకపోయినా గురక వచ్చే అవకాశం ఉంది.

    Also Read: వంకాయలు తీసుకోవడం వల్ల కలిగే లాభనష్టాలు ఇవే ?

    గురక వస్తుందంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాస సరిగ్గా ఆడకపోతే గురక వస్తుంది. అయితే గురక వచ్చే వాళ్లకు అవసరమైనంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వేధిస్తాయి. గురక ఎక్కువ రోజులు ఉంటే సరిగ్గా నిద్రపొకపోవడం వల్ల రక్తపోటు సమస్య వచ్చే అవకాశం ఉంది. బరువు పెరిగినా కొన్నిసార్లు గురక సమస్య వేధించే అవకాశం ఉంటుంది.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    వయస్సుకు, ఎత్తుకు తగిన బరువు ఉంటే గురక వచ్చే అవకాశం తగ్గుతుంది. ప్రతిరోజూ గురక వస్తుంటే మాత్రం మందులు వాడి సమస్య నుంచి బయట పడవచ్చు. వైద్యుల సలహాలు, సూచనలు పాటించి గురక సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు.