https://oktelugu.com/

బాగా నిద్రపోవడమే కరోనాకు మందు

దేశాన్ని కరోనా ఆవహించింది. ఏకంగా ప్రపంచంలోనే కరోనా కేసుల్లో ఆదివారంతో భారతదేశంలో రెండో స్థానంలో నిలిచింది. బ్రెజిల్ దేశాన్ని వెనక్కి నెట్టి ముందుకు దూసుకుపోయింది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా దేశంలో 90వేలకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఈ కేసులకు అంతలేదా? ఏం జరగబోతోందనే ఆందోళన అందరిలోనూ పట్టిపీడిస్తోంది. ప్రస్తుతానికి  కరోనాకు మందు కనిపెట్టలేదు.. వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.. దాని నుంచి తప్పించుకోవడం ఎలానో తెలియక అందరూ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2020 / 04:16 PM IST

    sleeping well

    Follow us on

    దేశాన్ని కరోనా ఆవహించింది. ఏకంగా ప్రపంచంలోనే కరోనా కేసుల్లో ఆదివారంతో భారతదేశంలో రెండో స్థానంలో నిలిచింది. బ్రెజిల్ దేశాన్ని వెనక్కి నెట్టి ముందుకు దూసుకుపోయింది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా దేశంలో 90వేలకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఈ కేసులకు అంతలేదా? ఏం జరగబోతోందనే ఆందోళన అందరిలోనూ పట్టిపీడిస్తోంది. ప్రస్తుతానికి  కరోనాకు మందు కనిపెట్టలేదు.. వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.. దాని నుంచి తప్పించుకోవడం ఎలానో తెలియక అందరూ నానా యాతన పడుతున్నారు.   ప్రస్తుతం రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే మన ముందున్న కర్తవ్యం.

    Also Read : పిల్లల జ్ఞాపకశక్తికి ఆవుపాలు/గేదె పాలు..? ఏవీ మంచివి.?

    కరోనాను స్వీయ నియంత్రణ చేసుకోవడమే ఇప్పుడు మనముందున్న ప్రథమ కర్తవ్యం. మూతికి మాస్క్, చేతులకు శానిటైజర్ లేదా గ్లోవ్స్ తో పాటు హ్యాండ్ వాష్ లు, సబ్బులతో చేతులు కడుక్కోవడమే ఇప్పుడు మనముందున్న మార్గం. ఇక వ్యాక్సిన్, మందులు లేకపోవడంతో    రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే ఇప్పుడు సరైన మార్గంగా ఉంది.

    ఇక ఇమ్యూనిటీని పెంచుకునేందుకు నిద్ర కూడా ఒక సరైన ఆయుధమని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. సరిగ్గా నిద్రపోకపోతే శరీరంలో తెల్లరక్తకణాల ఉత్పత్తి తగ్గిపోతుందట.. శరీరంలో వైరస్ బారిన పడిన కణాల్ని చంపేవి ఈ కణాలే. కాబట్టి నిద్ర తక్కువ అయ్యే కొద్దీ ఒంట్లో ఒంట్లో వైరస్ రిస్క్ పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు వైద్యులు. కాబట్టి కరోనా సోకిన కూడా నిద్ర పోవడం అనేది ఇందులో కీలకమైన సాధనంగా తెలుస్తోంది. అందుకే రోజుకు 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

    ఎంత ఎక్కువగా నిద్రపోతే అంత మంచిదని చెబుతున్నారు.ఇక నిద్రపట్టడం లేదంటే ఉదయాన్నే కాసేపు ఎండలో ఉండాలని సూచిస్తున్నారు. అలా అయితే రోజంతా చలాకీగా ఉంటారు. రాత్రిపూట బాగా నిద్ర పడుతుంది. మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు. ఎందుకంటే రాత్రి నిద్రపట్టదు. రాత్రి నిద్రే మనిషి ఆరోగ్యానికి మంచిది. కాఫీ, టీలు తాగడం తగ్గించాలి.  రాత్రి భోజనంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. నిద్రపోయే ముందు పాలు, మజ్జిగ తాగితే నిద్ర పడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో కరోనా దరిచేరవద్దంటే ఎంత ఎక్కువ సేపు పడుకుంటే అంత మేలన్నమాట..

    Also Read : డేంజర్: కరోనాతోపాటే మరో రెండు భీకర వ్యాధులు