Sleep Talking: సాధారణంగా నిద్రలో ఉన్నప్పుడు కొందరు కలవరిస్తారు. వారికి తెలియకుండానే నిద్రలో మాట్లాడటం, గట్టిగా అరవడం వంటి చేస్తుంటారు. నిజ జీవితంలో ఎలా ఇతరులతో మాట్లాడుతారో.. అలానే నిద్రలో కూడా కలవరిస్తుంటారు. ముఖ్యంగా రోజులో ఏ విషయం గురించి ఎక్కువ మాట్లాడుతారో దాని గురించే కలవరిస్తుంటారు. ఇలా కలవరిస్తున్నట్లు మనకి తెలియదు. కానీ మన పక్కన ఉన్న వాళ్లకి అయితే తెలుస్తుంది. నిద్ర నుంచి బయటకు వచ్చిన కూడా కలవరించినట్లు తెలియదు. అయితే పిల్లలు ఎక్కువగా నిద్రలో కలవరిస్తారు. రోజంతా ఆడుకోవడం వంటి వాటి వల్ల పిల్లలు కలవరిస్తారు. అయితే ఎప్పుడో ఒకసారి కలవరిస్తే పర్లేదు. కానీ రోజూ ఇలానే నిద్రలో కలవరిస్తే మాత్రం లైట్ తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. అసలు నిద్రలో ఎందుకు కలవరిస్తారు? దీనికి గల కారణాలు ఏంటి? దీని నుంచి బయటపడటం ఎలాగో ఈస్టోరీలో తెలుసుకుందాం.
మీకు తెలియకుండా నిద్రలో కలవరించడాన్ని సోమ్నీ లోక్వి అంటారు. అయితే ఇది అందరిలో ఉండదు. కేవలం కొందరిలో మాత్రమే కనిపిస్తుంది. ఎక్కువగా మూడు నుంచి పదేళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే కనిపిస్తుంది. సాధారణంగా పిల్లలు నిద్రలో మాట్లాడతారు. కానీ అది ఎక్కువగా జరిగితే మాత్రం తప్పకుండా వైద్యని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే నిద్రలో కలవరించడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పీడకలలు, ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు వంటి వాటి వల్ల కొందరు కలలో కలవరపడుతుంటారని నిపుణులు అంటున్నారు. పిల్లలు ఎక్కువగా ఇతరులతో ఆడుతుంటారు. ఇలాంటి సమయాల్లో వారు కొన్ని విషయాలకు భయపడటం వంటివి చేస్తుంటారు. వీటివల్ల వారికి తెలియకుండానే నిద్రలో కలవరిస్తుంటారు. అలాగే పిల్లలకు సరైన నిద్ర లేకపోవడం, అధిక జ్వరం వంటి సమయాల్లో కూడా కలవరిస్తారు. కొందరు బాగా అలసిపోయినప్పుడు, డిప్రెషన్‌లోకి వెళ్లడం వల్ల నిద్రలో కలవరింతలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
నిద్రలో కలవరింత సమస్య నుంచి విముక్తి చెందాలంటే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించాలి. కలవరింత ఏం కాదని లైట్ తీసుకోకుడదని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే బాడీకి సరిపడా నిద్రపోవాలి. అలాగే ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండాలి. చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించి, టెన్షన్ తీసుకోకూడదు. మెడిటేషన్, యోగా వంటివి చేస్తుండాలి. దేని గురించి పగలంతా ఎక్కువగా ఆలోచిస్తారో.. రాత్రి సమయాల్లో కలవరిస్తారు. కాబట్టి ఎక్కువగా ఏ విషయం గురించి ఆలోచించవద్దు. పూర్తిగా నిద్రకు దూరంగా ఉండకుండా బాడీకి సరిపడా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. రోజుకి తప్పకుండా 8 గంటలు నిద్రపోండి. అప్పుడే మీకు ఎలాంటి కలవరింతలు నిద్రలో రావు. నిద్రలేమి సమస్య ఉన్నా కూడా ఇది ఎక్కువ అవుుతంది. ఇలా ఎన్ని నియమాలు పాటించిన కూడా సమస్య పరిష్కారం కాలేదంటే.. మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఏం కాదులే అని లైట్ తీసుకున్నారో.. ఇక అంతే సంగతులు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.