Sleep Problems: నిద్రకు జ్ఞాపకశక్తికి సంబంధం ఉందట.. మరి ఎన్ని గంటలు నిద్ర పోవాలంటే

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మంది ఫోన్ లోనే తల పెడుతున్నారు. ఫోన్ చూస్తూనే నిద్ర పోయే వారి సంఖ్య చాలా పెరుగుతుంది కూడా. రేడియేషన్ అని తెలిసి కూడా ఫోన్ ను దూరం పెట్టడం లేదు.

Written By: Swathi Chilukuri, Updated On : June 19, 2024 11:56 am

Sleep Problems

Follow us on

Sleep Problems: నిద్ర ప్రతి ఒక్కరికి చాలా అవసరం. నిద్ర వల్లనే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి దూరం అవవచ్చు. సరైన నిద్ర ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే ఎన్నో సమస్యల వల్ల పోరాడాల్సిందే. ప్రస్తుతం బిజీ లైఫ్ వల్ల చాలా మంది సరైన నిద్ర పోవడం లేదు. ముఖ్యంగా యువత నిద్రలేమి సమస్యలతో బాధ పడుతున్నారు. ఇక ఉద్యోగాలు చేసేవారు కూడా దీనికి ఇబ్బంది పడుతున్నారు. షిఫ్టులు ఉన్నవారు రాత్రి పది గంటల వరకు కూడా ఆఫీస్ లలోనే ఉంటారు. ఇలాంటి వారికి చాలా సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మంది ఫోన్ లోనే తల పెడుతున్నారు. ఫోన్ చూస్తూనే నిద్ర పోయే వారి సంఖ్య చాలా పెరుగుతుంది కూడా. రేడియేషన్ అని తెలిసి కూడా ఫోన్ ను దూరం పెట్టడం లేదు. దీని వల్ల రాత్రి 12 గం.ల అయినా సరే నిద్ర పోవడం లేదు. రాత్రి 10 గం. లకు పడుకొని ఉదయం 5 గం.కు లేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది అంటారు నిపుణులు. ఉదయం నిద్ర లేచే వారు సక్సెస్ అవుతారని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ 8,9 అవుతున్నా నిద్ర లేవని వారి సంఖ్య కూడా పెరుగుతుంది.

సరైన నిద్ర ఉంటే జ్ఞాపక శక్తి బాగుంటుందట. నేటి యువత చాలా తక్కువ సమయం పడుకుంటున్నారు. అందుకే వారి జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండటం లేదు అంటున్నారు నిపుణులు. అయితే ఎనిమిది గంటలు కచ్చితంగా పడుకోవాలి. దీని కోసం మధ్యాహ్నం గంట సేపు పడుకున్నా సరిపోతుంది. రాత్రి 7 గంటలు నిద్ర పోవాలి. కానీ కొందరికి మధ్యాహ్నం నిద్ర పోవడం కుదరదు. అలాంటి వారు కచ్చితంగా రాత్రి ఎనిమిది గంటలు నిద్ర పోవాల్సిందే.

ఒకపూట అన్నం మానేసినా పర్వాలేదు కానీ నిద్ర మాత్రం మానేయకూడదు అంటున్నారు నిపుణులు. మరి మీరు ఎన్ని గంటలు నిద్ర పోతున్నారు అనేది మీరు కచ్చితంగా ఆలోచించాలి. రాత్రి ఎనిమిది గంటలు లేదా ఏడు గంటలు పడుకొని మధ్యాహ్నం ఒక గంట అయినా పడుకోవాల్సిందే. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర ఉంటే చాలు మీరు ఎలాంటి ఆస్పత్రికి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉంటారు. సో జాగ్రత్త.