Skin Peeling : అరచేతుల చర్మం పొట్టులుగా రాలుతోందా.. ఏం చేయాలంటే?

ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిని చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. సమస్యలు చిన్న సమస్యలే అయినా ఆ సమస్యల వల్ల పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొంతమంది అరచేతుల, అరికాళ్ల చర్మం పొట్టులా రాలుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్య చాలామందిని వేధిస్తూ ఉంటుంది. చర్మంలో దాగి ఉన్న ఇన్ఫెక్షన్ తో పాటు ఇతర సమస్యల వల్ల ఈ సమస్య ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఈ సమస్యతో […]

Written By: Navya, Updated On : August 15, 2021 11:42 am
Follow us on

ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిని చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. సమస్యలు చిన్న సమస్యలే అయినా ఆ సమస్యల వల్ల పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొంతమంది అరచేతుల, అరికాళ్ల చర్మం పొట్టులా రాలుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్య చాలామందిని వేధిస్తూ ఉంటుంది. చర్మంలో దాగి ఉన్న ఇన్ఫెక్షన్ తో పాటు ఇతర సమస్యల వల్ల ఈ సమస్య ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

అయితే ఈ సమస్యతో బాధ పడేవాళ్లు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. స్నానం చేసే సమయాన్ని పది నిమిషాల నుండి ఐదు నిమిషాలకు తగ్గిస్తే మంచిది. ఎక్కువ సమయం స్నానం చేస్తే చర్మం ఉబ్బే అవకాశాలు ఉంటాయి. ఇలా చేయడం ద్వారా పొట్టు వచ్చే అవకాశంతో పాటు చర్మంలో ఉండే సహజ నూనెలు సైతం తొలగించబడే అవకాశాలు అయితే ఉంటాయి.

స్నానం చేసిన తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ రాయడం వల్ల చర్మంలో తేమను నిలుపుకునే అవకాశం అయితే ఉంటుంది. పిల్లల్లో కొంతమంది బయట ఆడుకునే సమయంలో వేర్వేరు ఉపరితలాలపై ఉండే బ్యాక్టీరియా, శిలీంధ్రాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా స్కిన్ ఎలర్జీ బారిన పడే అవకాశం ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్లిన సమయంలో బయటి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో కాళ్లను, చేతులను నీటితో శుభ్రం చేసుకోవాలి.

పిల్లల గదిలో తప్పనిసరిగా హ్యూమిడిఫైయర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. హ్యూమిడిఫైయర్ శరీరంలో తేమను పెంచడంతో పాటు చర్మంలో పొడిని నివారించడంలో సహాయపడుతుంది. జాగ్రత్తలు తీసుకున్నా సమస్య తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిది.