Homeఎంటర్టైన్మెంట్RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పై విజయేంద్రప్రసాద్‌ ముచ్చట్లు !

RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పై విజయేంద్రప్రసాద్‌ ముచ్చట్లు !

K.V. Vijayendra Prasad - RRR Movie

తెలుగు సినీ రచయితగా నేడు విజయేంద్రప్రసాద్‌ కి దేశవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉంది. కానీ ఆ గుర్తింపు వెనుక సంవత్సరాల తరబడి ఆయన కష్టం ఉంది. ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ కనిపించే ఆయన జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి. తన కథలతో రికార్డులు తిరగరాసే సినిమాలు అందించినా… ఆయన మాత్రం ఎప్పుడు సింపుల్ గానే ఉంటారు.

అయితే, దేశభక్తి సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి విజయేంద్రప్రసాద్‌ కొన్ని ఆసక్తికర విశేషాలు వెల్లడించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా రాయడానికి చరిత్రలోని సంఘటనలను ఆయన పరిశీలించారట. అయితే ఈ క్రమంలో ఆయన కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సీతారామరాజు, కొమురం భీమ్‌ ఇద్దరూ దేశభక్తులే. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని చెప్పలేం కదా.

విజయేంద్రప్రసాద్‌ కూడా ఇదే సమస్యతో చాలా రోజులు తపన పడ్డారు. ఏ పాత్రను ఎలా చెప్పాలి అని. అందుకే ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. సీతారామరాజు, కొమురం భీమ్‌ ఆటోబయోగ్రఫీ చెప్పాలనే ఉద్దేశాన్ని వదులుకున్నారు. ఆ ఇద్దరి స్ఫూర్తితో సీన్లు రాసుకున్నారు. అయితే వీరిద్దరూ ఒకే పరిస్థితుల్లో నివసించారు కాబట్టి, అలాంటి అంశాల్లో ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండేవారు అని ఊహించి రాశారు.

అందుకే, కథలో అనేక భావోద్వేగాలను విజయేంద్రప్రసాద్‌ క్రియేట్ చేయగలిగారు. కానీ, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ అంటేనే గొప్ప దేశభక్తులు. మరి వారి పాత్రల్లో ఇద్దరు మాస్ హీరోలు.. పైగా వారికి ప్రేమకథలు. ఈ అంశాల్లో విజయేంద్రప్రసాద్‌ చాలా కష్టపడాల్సి వచ్చిందట.

అల్లూరి, కొమురం భీమ్‌ నుండి ప్రేక్షకులు దేశభక్తినే కోరుకుంటారు. దేశ భక్తితో పాటు ప్రేక్షకుడిని మెప్పించటానికి అన్ని కమర్షియల్ అంశాలను జోడించారట. సినిమా అద్భుతంగా వచ్చింది అని విజయేంద్రప్రసాద్‌ చెప్పుకుకొచ్చారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version