Skin Care Tips: సన్ స్క్రీన్ చర్మాన్ని కాపాడటంలో మాత్రమే కాదు అందంగా మార్చడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఈ క్రీమ్ ను కఠినమైన యూఏవిఏ లేదా బి కిరణాల నుంచి తప్పించుకోవడానికి అప్లై చేస్తారు. కానీ దీన్ని ప్రతి రోజు తప్పకుండా రొటీన్ కేర్ లాగ ఉపయోగించాలి. మరి దీన్ని ఇంట్లో మాత్రమేనా లేదంటే బయటకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగించాలా అనే అనుమానం మీలో ఉందా? అయితే ఇదొకసారి చూసేయండి..
సన్ స్క్రీన్ లోషన్ ఒకసారి రాసుకున్న తర్వాత మరో రెండు గంటలకు మళ్లీ తిరిగి రాసుకోవచ్చు. బయటకు వెళ్ళినప్పుడు ఒక సారి రాసుకోవాలి. తర్వాత రెండు గంటలు పూర్తయ్యాక మరో సారి రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా చేస్తే మీ స్కిన్ పాడవదు అంటున్నారు నిపుణులు. పైగా హానికరమైన కిరణాలు ముఖానికి తాకవు. ఏది ఏమైనా ముఖానికి రెండు సార్లు అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.
సన్ స్క్రీన్ వల్ల చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. అయితే సన్ స్క్రీన్ ని ఎందుకు రెండు సార్లు అప్లై చేసుకోవాలనే డౌట్ కూడా వచ్చే ఉంటుంది కదా మీకు.. అయితే దీన్ని రెండు సార్లు రాసుకోవడం వల్ల సూర్య కిరణాల వల్ల ఎటువంటి హానీ కలగదు. కానీ చెమట, నూనె వల్ల స్క్రీన్ తొలగిపోతుంది. కాబట్టి మంచి ఫలితాల కోసం సన్ స్క్రీన్ ని మరో లేయర్ గా రాసుకోవాలి అంటున్నారు నిపుణులు.
బయటకు వెళ్లకపోయినా సరే ఇంట్లో ఉన్నా కూడా రోజుకు రెండు సార్లు సన్ స్క్రీన్ ను ఉపయోగించండి. చాలా మంది ఇంట్లోనే ఉన్నాం కదా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం ఎందుకని లైట్ తీసుకుంటారు. ఇంట్లో ఉండేటప్పుడు కిటికీలు, తలుపులు నుంచి గోడల నుంచి కొంత సూర్య కిరణాలు మొహం మీద పడతాయి..ఈ సూర్య కిరణాలకు కూడా స్కిన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఇంట్లో ఉండి కూడా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఈ సన్ స్క్రీన్ లోషన్ వల్ల సూర్య కిరణాల వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఉండొచ్చు. పైగా మీరు సన్ స్క్రీన్ లోషన్ రాసుకునేటప్పుడు రెండు నుంచి మూడు గంటలకు తిరిగి మళ్లీ అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా వేసవి లో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో కచ్చితంగా వాడాలి. వేసవి లో ఎండ తీవ్రంగా ఉండటం వల్ల స్కిన్ త్వరగా పాడవుతుంది. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి ఎండలు ఎక్కువగా లేవు. చెమటలు కూడా ఎక్కువ రావడ లేదు కదా. ఇక ఎండాకాలంలో అయితే చెమటలు కూడా విపరీతంగా పడుతుంటాయి. అందుకే సన్ స్క్రీన్ లోషన్ తో చర్మాన్ని కాపాడుకోవాలి. దీని వల్ల స్కిన్ కు కూడా ఎలాంటి సమస్యలు రావు. కానీ కొన్ని సన్ స్క్రీన్ లోషన్లు ఎక్కువ కెమికల్ తో నిండి ఉంటాయి కాబట్టి జాగ్రత్త. చూసి తీసుకోవడం బెటర్.