Pimples Cause Food: సాధారణంగా ప్రతి ఒక్కరూ ఎంతో అందంగా కనపడాలని భావిస్తారు. ఈ క్రమంలోనే మార్కెట్లో లభించే ఎన్నో రకాల సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తూ అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చాలామంది విపరీతమైన మొటిమల సమస్యతో బాధపడుతుంటారు. మొటిమలు అందవిహీనంగా కనిపించేలా చేస్తుంటాయి.మరి ఈ మొటిమల సమస్య నుంచి విముక్తి పొందడం కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలను దూరంగా పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఫ్రిజ్ లో ఈ ఎనిమిది పదార్థాలను ఉంచితే చాలా ప్రమాదం.. అవేంటంటే?
ఈ క్రమంలోనే 2002 సం.లో ఆర్చీవ్స్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం కొన్ని ఆహార పదార్థాలు మొటిమలకి కారణం అవుతాయని నిరూపించారు ఈ క్రమంలోనే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వెల్లడించారు. మరి ఆహార పదార్థాలు ఏంటి అనే విషయానికి వస్తే…
*మొటిమల సమస్యతో బాధపడేవారు చాక్లెట్లకు దూరంగా ఉండాలి. ఇందులో అధికంగా చెక్కెర ఉండటం వల్ల మన శరీరంలో సెబమ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల మొటిమలు పెరిగే అవకాశం ఉంటుంది కనుక చాక్లెట్లకు దూరంగా ఉండాలి.
*చాలా మంది ఎక్కువగా స్పైసి ఫుడ్ తినడానికి కి ఇష్టపడతారు అధిక మొత్తంలో కారం కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మొటిమలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఎక్కువ కారం కలిగిన ఆహార పదార్థాలను తినకూడదు.
*చాలామంది జున్ను ప్రియులు ఉంటారు. అయితే అధికంగా జున్ను తినడం వల్ల మొటిమల సమస్యలతో బాధ పడాల్సి ఉంటుంది. 2005 సం.లో జర్నల్ ఆఫ్ ద అమెరికన్ అకాడెమి ఆఫ్ డెర్మటాలజీ వ్యాసం ప్రకారం జున్ను లేదా పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం వల్ల మొటిమలు పెరిగే అవకాశం ఉందని నిరూపించారు.
*సోడాలో ఎక్కువగా శుద్ధి చేయబడిన చక్కెర ఉంటుంది. ఈ విధమైనటువంటి పదార్థాలను తినడం లేదా తాగడం వల్ల శరీరంలో ఎక్కువగా కొవ్వు పెరుగుతుంది ఫలితంగా రక్తంలోని ఇన్సులిన్ టెస్టోస్టిరాన్ అధికంగా విడుదల కావడం వల్ల మొటిమలు ఎక్కువగా వస్తాయి. కనుక ఈ పదార్థాలను వీలైనంత వరకు దూరం పెట్టడం వల్ల మొటిమల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
Also Read: పవన్ కళ్యాణ్‌తో రాజమౌళి భేటీ.. ఆ విషయంపైనే చర్చించనున్నారా?