Headache: బిజీ, నో హెల్దీ ఫుడ్ అందుకే చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చిన్న చిన్న సమస్యల నుంచి ఊహించని సమస్యలు కూడా ప్రస్తుతం ప్రజలను వెంటాడుతున్నాయి. కొన్ని నయం అయ్యే సమస్యలు వస్తే మరికొన్ని జీవితాంతం వెంటాడే సమస్యలు కూడా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా తలనొప్పి అయితే చాలా మందిని బాధ పెడుతున్న సమస్య. ఈ తలనొప్పి వల్ల సరిగ్గా పనిచేసుకోలేరు. నిద్రపోలేరు. తినలేరు. కొందరికి ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలైతే రాత్రి వరకు కూడా ఉంటుంది. అయితే తలనొప్పిని తరిమి కొట్టే ఓ చిన్న టిప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బ్రహ్మి: బ్రహ్మి అనే మూలిక ఒత్తిడి, మానసిక కుంగుబాటులను వదిలించడంలో సహాయం చేస్తుంది.. అందుకే తలనొప్పుల కోసం బ్రహ్మిలో నెయ్యి కలిపి కొన్ని చుక్కలను ముక్కు రంధ్రంలో వేసుకుంటే తలనొప్పి ఇట్టే తగ్గుతుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
గంధం: ఇది పురాతనమైన చిట్కా. గంధం నూరి నుదుటికి పెట్టుకోవాలి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇందుకోసం అర చెంచా గంధం పొడికి కొన్ని చుక్కల నీళ్లు కలిపి ముద్దలా చేసి నుదుటి మీద 20 నిమిషాల పాటు పెట్టుకొని కాసేపు రిలాక్స్ గా పడుకోవాలి.
తగర్: ఈ మూలికకు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. దీన్ని ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద చికిత్సల్లో ఉపయోగిస్తున్నారు. దీనికి ఉన్న ఔషధగుణాలు అమోఘమైనవి అంటారు నిపుణులు. దీన్ని ఔషధగుణాలు కలిగిన నూనెలతో కలిపి మర్దన చేయాలి. లేదంటే తేనీటిలో కలిపి సేవించినా సరే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు.
యాలకులు: యాలకులను నమలడం వల్ల తలనొప్పి తగ్గుతుందట. అయితే యాలకులను నోట్లో వేసుకొని నములుతూ ఉండాలి. దీనిలో ఉండే ఔషధ గుణాలు మీ తలనొప్పిని తరిమి కొడుతాయట. మరీ ముఖ్యంగా కొందరు తలనొప్పి ఉన్నప్పుడు టీలో యాలకులను వేసి మరిగించి మరీ టీ తాగుతారు. ఇలా తాగడం వల్ల తలనొప్పి పోతుందట.
రాతి ఉప్పు: సాధారణ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పు వాడటం చాలా మంచిది. దీని వల్ల ఎన్నో రకాల తలనొప్పులకు చెక్ పెట్టవచ్చు. గోరువెచ్చని నీటిలో చిటికెడు రాతి ఉప్పు వేసి తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఇప్పటి వరకు తెలుసుకున్న ప్రతి ఒక్క టిప్ కూడా ఆయుర్వేద వైద్యానికి సంబంధించినదే. కానీ ప్రతి మూలికలు, పౌడర్లు ప్రతి ఒక్కరికి పడకపోవచ్చు. అందుకే జాగ్రత్త.
లవంగం నూనె తలనొప్పిని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ నూనెకు బ్యాక్టీరియా కణాలను చంపే శక్తి ఉండటం వల్ల మీకు మంచి సహాయకారిణి అవుతుంది. లవంగం నూనెలో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటను తగ్గించడంలో సహాయం చేస్తాయి. అందుకే తలనొప్పి ఉంటే లవంగం నూనెను తలకు పట్టించి మసాజ్ చేసుకోండి. ఇది మీ తలను చల్లగా చేసి, నొప్పిని తగ్గిస్తుంది.