Health Tips: ఉరుకులపరుగుల జీవితం వల్ల ప్రజల ఆహారపు అలవాట్లు రోజురోజుకు వేగంగా మారిపోతున్నాయి. మనలో చాలామంది ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. రాత్రి ఎక్కువ సమయం మేలుకుని ఉండటం, ఉదయం సమయంలో ఆలస్యంగా నిద్ర లేవడం చాలామందికి అలవాటుగా మారుతోంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల చాలామందిని ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి.
కొంతమంది నేరుగా లంచ్ చేయడం చేస్తున్నారు. అయితే ఈ విధంగా చేయడం వల్ల చాలామందిని అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. బ్రేక్ ఫాస్ట్ సమయంలో కొందరు కూల్ డ్రింక్స్ తాగడం, చిరుతిళ్లు తినడం చేస్తుండగా ఇలా చేయడం వల్ల తీవ్రమైన తలనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనం ప్రకారం బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వాళ్లలో పోషకాలు లోపిస్తున్నాయి.
ఎవరైతే బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారో వాళ్లు హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఇడ్లీ, చపాతీ, దోసె, పూరీ ఆహారంగా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. పండ్లు, కూరగాయలు, పప్పులతో చేసిన సలాడ్స్ తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్యానికి మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ తినని వాళ్లను చిరాకు, కోపం, అలసట లాంటి సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఎవరైనా డైటింగ్ చేయాలని భావించినా అల్పాహారం తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు జ్ఞాపకశక్తి పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతిరోజూ కచ్చితంగా అల్పాహారం తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.