కివిలో ఉండే పొటాషియం కిడ్నీ వ్యాధులతో బాధ పడేవాళ్లపై మరింత ఎఫెక్ట్ చూపుతుంది. వైద్యులు సైతం కిడ్నీ వ్యాధులతో బాధ పడేవాళ్లు కివి పండ్లను తినకూడదని సూచిస్తున్నారు. కివి పండ్లలో ఇతర పండ్లతో పోలిస్తే యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అసిడిటీ సమస్యలతో బాధ పడేవాళ్లకు సైతం కివి పండ్లు మంచివి కాదు. తక్కువ మొత్తంలో కివిని తీసుకుంటే చర్మానికి మంచిది.
ఎక్కువగా కివి పండ్లను తింటే మాత్రం చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చర్మంపై దద్దుర్లు, పెదవులు, నాలుక వాయడం ఇతర సమస్యలు వస్తాయి. స్కిన్ అలర్జీ ఉన్నవాళ్లు సైతం కివి పండ్లను తినకుండా ఉంటే మంచిది. గర్భిణీ స్త్రీలు రోజులో మూడి కివి పండ్ల కంటే ఎక్కువ పండ్లను తినకూడదు. కివి పండ్లను గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకుంటే చర్మంపై దద్దుర్లు, గొంతు నొప్పి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
గ్యాస్ట్రిటిస్, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నా కివి పండ్లను తినకూడదు. కివి పండ్ల వల్ల మైకం, వాంతులు, విరేచనాల సమస్య తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలెర్జీ ఉన్నవాళ్లు కివి పండ్లను పూర్తిగా దూరంగా ఉంటే మంచిది.