మనలో చాలామంది ఏవైనా ఆరోగ్య సమస్యల వల్ల ఆస్పత్రికి వెళితే వైద్యులు ఆపిల్ పండ్లను తినాలని సూచిస్తూ ఉంటారు. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంతో ఆపిల్ సహాయపడుతుంది. ఆపిల్ జీర్ణ సంబంధిత వ్యాధులను దూరం చేయడంతో పాటు హృదయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే యాపిల్ యాంటీ ఆక్సిడెంట్ లా కూడా పని చేస్తుంది. ఆహారం తీసుకునే ముందు ఆపిల్ ను తింటే ఆహారం తక్కువగా తిని బరువు తగ్గుతాము.
క్యాన్సర్ నివారణలో కూడా ఆపిల్ సహాయపడుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. పెద్ద ప్రేగులలో బ్యాక్టీరియా పనితీరును మెరుగుపరచడంలో ఆపిల్ సహాయపడుతుందని సమాచారం. రక్తహీనత సమస్యతో బాధ పడేవాళ్లలో ఆ సమస్యను నివారించడానికి ఆపిల్ తోడ్పడుతుంది. రోజుకు ఒకటి లేదా రెండు ఆపిల్స్ ను తినడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. మలబద్ధకం సమస్యతో బాధ పడేవాళ్లు ఆపిల్ తింటే మంచిది.
బలహీనంగా ఉన్న వ్యక్తుల్లో శక్తిని పెంపొందించడంలో ఆపిల్ సహాయపడుతుంది. అయితే ఆపిల్ పండ్లను ఎక్కువగా తిన్నా నష్టమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. రెండు కంటే ఎక్కువ ఆపిల్స్ తింటే తీవ్రమైన జీర్ణ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. షుగర్ తో బాధ పడేవాళ్లు ఆపిల్ పండ్లను తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
డిఫెనిలామైన్ అనే పురుగు మందును కలిగి ఉన్న ఆపిల్ ను తీసుకుంటే వివిధ ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. ఆపిల్ పండ్లు ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆమ్లం ఎక్కువగా ఉండే ఆపిల్స్ దంత సమస్యలకు కారణమవుతాయి.