Mineral Water: సర్వకోటి ప్రాణాధారానికి నీరే ప్రధానం. నీరు లేకపోతే జీవనం మనుగడ సాగదు. అయితే నేటి కాలంలో డబ్బులు పెట్టి మరీ నీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాతావరణ కాలుష్యం, నీటి కలుషితం కారణంగా ఫిల్టర్ చేసిన నీళ్లు తాగాల్సి వస్తోంది. అయితే ఫిల్టర్ నీరు తీసుకున్న కొందరు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు.
మినరల్ వాటర్ లో ఉపయోగించే కెమికల్స్ శరీరంలోకి వెళ్లి అనేక సమస్యలు తీసుకొస్తున్నాయి. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం వాటార్ బాటిళ్లలో దొరికే నీరు కూడా ప్రమాదకరమని తేల్చారు. వీటిలో ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని, ఇవి శరీరంలోకి వెళ్లి అనేక వ్యాధులు రావడానికి కారణమవుతాయని వెల్లడించారు. వారి పరిశోధన వివరాల్లోకి వెళితే..
మున్సిపల్ ద్వారా వచ్చే నల్లా నీరు కలుషితంగా మారిందని చాలా మంది మినరల్స్ వాటర్ తాగుతున్నారు. మరికొందరు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ప్రయాణాలు చేసేటప్పుడు వాటర్ బాటిళ్లు కొనుక్కుని మరీ తాగుతున్నారు. కానీ ఈ వాటర్ బాటిళ్లు ప్రమాదకరమని అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ వెల్లడించింది. ఈ సంస్థకు చెందిన పరిశోధకులు మూడు కంపెనీలకు చెందిన 25 లీటర్ల నీటిపై పరిశోధన చేశారు. ఇందులో మైక్రోమీటర్ కన్నా తక్కువ సైజులో ఉన్న ప్లాస్టిక్ ను గుర్తించారు.
ప్రతీ లీటర్ బాటిళ్లలో 2,40,000 ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని, ఇవి ఇప్పటి వరకు అంచనా వేసినదానికన్నా ఎక్కువేనని పరిశోధకులు తేల్చారు. ఈ ప్లాస్టిక్ రేణులు వాటర్ బాటిల్ నీరు ద్వారా శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు చేరుతాయన్నారు. గర్భంలో ఉన్న శిశువులోకి కూడా ఇవి చేరే ప్రమాదం ఉందని తెలిపారు. నీళ్లలో ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని ఇప్పటికే పలు పరిశోధనలు జరిగాయి. 2002లో జరిగిన పరిశోధనలో జరిగిన పరిశోధనలో నల్లాద్వారా వచ్చే నీళ్లలో ప్లాస్టిక్ రేణువులు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో వాటర్ బాటిళ్ల నీటి కంటే నల్లా ద్వారా వచ్చే నీళ్లలో ప్లాస్టిక్ రేణువులు తక్కువగా ఉంటాయని గుర్తించారు. అయితే ఆ నీటిని శుభ్రం చేసుకొని తాగడం ద్వారా ఎలాంటి ప్రమాదాలు ఉండవని అంటున్నారు. ప్లాస్టిక్ బాటిల్ నీరు ఎప్పటికైనా ప్రమాదాన్ని తెస్తుందని పరిశోధకులు తెలిపారు.