Peanuts: మనలో చాలామంది పల్లీలు తినడాన్ని ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. వాతావరణం చల్లగా ఉంటే పల్లీలు తినడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతారు. పల్లీలు తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే పల్లీలు తక్కువగా తింటే ఎలాంటి నష్టం లేకపోయినా మితిమీరి తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి. పల్లీలు ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు పల్లీలలో ఎక్కువగా ఉంటాయి. పల్లీలలో ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. పల్లీలు తినడం వల్ల సులువుగా బరువు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకరోజుకు మన శరీరానికి 1600 నుంచి 2400 కేలరీలు అవసరం కాగా కొన్ని రకాల వేరుశెనగల ద్వారా 170 కేలరీలు లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పల్లీలలో ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.
శరీరంలో ఫైటిక్ యాసిడ్ ఎక్కువ అయితే శరీరానికి అవసరమైన ఇనుము, జింక్, క్యాల్షియం, మెగ్నీషియం అందవు. ఫైటిక్ యాసిడ్ వల్ల కొన్నిసార్లు పేగుల్లో ఎలర్జీలతో పాటు విటమిన్స్ లోపం కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పల్లీ గింజలలో ఉప్పు వేసుకొని చాలామంది తింటూ ఉంటారు. అయితే ఉప్పు వేసిన పల్లీలలో సోడియం ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే.
ఈ పల్లీలను తినడం వల్ల గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పల్లీలు తినడం వల్ల అలర్జీలు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పల్లీల వల్ల దురద, శ్వాస సమస్యలు, డయేరియా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం.