Wheat Flour Effects: ప్రస్తుత కాలంలో బరువు తగ్గాలని భావించే వాళ్లు, షుగర్ తో బాధ పడేవాళ్లు ఎక్కువగా చపాతీలను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. వైద్యులు సైతం చపాతీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని సూచనలు చేస్తున్నారు. చాలామంది గోధుమ పిండి ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్ లభిస్తుందని భావిస్తారు. అయితే మనం వాడే గోధుమ పిండిలో ఫైబర్ కంటే ఎక్కువగా గ్లూటెన్ ఉంటుంది. గ్లూటెన్ శరీరంలో ఎక్కువైతే నష్టమే తప్ప లాభం ఉండదు.
పూర్వ కాలంలో ధాన్యాన్ని పొట్టుతో సహా వినియోగించేవారు. ధాన్యంపై ఉండే పొట్టు ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్ లభిస్తుంది. అయితే ప్రస్తుతం మిషన్ల సహాయంతో ధాన్యంను పొట్టు లేకుండా చేసి పిండిని తయారు చేస్తున్నారు. గోధుమల ద్వారా తయారు చేసే పిండిలో కొంచెం కూడా ఫైబర్ ఉండదు. ఎక్కువగా చపాతీలను తినేవాళ్లకు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
Also Read: బ్లాక్ క్యారెట్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?
ఫైబర్ లేని చపాతీలను తింటే షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటు శరీరంలో కొవ్వు పెరిగి బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి గోధుమపిండితో చేసిన చపాతీలను ఎక్కువగా తినడం ద్వారా సీలియాక్ వ్యాధి బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటి గోధుమపిండితో చేసిన చపాతీలు ఎక్కువగా తింటే కడుపునొప్పి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువగా ఇలాంటి చపాతీలు తింటే కడుపునొప్పి, పేగు సంబంధిత సమస్యలు వస్తాయి.
చిన్న పేగు క్యాన్సర్ కూడా చపాతీలు ఎక్కువగా తినేవాళ్లకు వచ్చే అవకాశం ఉంటుంది. ముడి గోధుమలతో చపాతీలను పిండి పట్టించుకొని తినడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ లో లభించే చపాతీలు తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.