మారుతున్న కాలంతో పాటే మనుషుల జీవితంలో సమయానికి ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోంది. ఎంత ఎక్కువ సమయాన్ని సద్వినియోగపరచుకుంటే అంత త్వరగా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో చాలామంది ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
Also Read: ఎస్బీఐ బంపర్ ఆఫర్… ఈఎంఐ కట్టకుండా రూ. 5 లక్షల రుణం..?
ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు చేయడం వల్ల ఆ పనులపై దృష్టి పెట్టడం కూడా సాధ్యం కాదని తెలుపుతున్నారు. తరచూ మల్టీ టాస్కింగ్ చేసేవాళ్లు మతిమరపు బారిన పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. శరీరంలో కారిస్టాల్ అనే ఒత్తిడిని పెంచే హార్మోన్ వల్ల మల్టీ టాస్కింగ్ చేసే వాళల్లో ఈ సమస్య ఉత్పన్నమవుతోందని తెలుపుతున్నారు. ఒకే సమయంలో టీవీ చూస్తూ ఫోన్ తో కాలక్షేపం చేసినా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు.
మరి కొంతమంది ఒకటికంటే ఎక్కువ బ్రౌజర్లను ఓపెన్ చేస్తూ ఉంటారని.. అలా చేయడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలుపుతున్నారు. మల్టీ డిజిటల్ మీడియాను ఎక్కువగా వినియోగించే వ్యక్తులు కొన్ని సంఘటనలు తెలుసుకోలేకపోవడానికి ఇదే కారణమని తెలిపారు. 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 80 మంది వ్యక్తులపై పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు.
Also Read: లోన్ తీసుకుంటున్నారా… తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే రెండు బ్యాంకులివే..?
మల్టీ మీడియా టాస్కింగ్ లు చేసేవాళ్లు ఎక్కువగా శ్రద్ధ కోల్పోతున్నారని తేలిందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అయితే మల్టీ టాస్కింగ్ మతిమరుపుకు ఏ విధంగా దారి తీస్తుందో తెలుసుకోవడానికి మరికొన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.