
ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవదహనమైన సంఘటన కడప జిల్లాలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని కడప శివారు గోటూరు వద్ద రెండు కార్లు టిప్పర్ ను ఢీకొన్నాయి. మొదటికారు టిప్పర్ వెనుకబాగాన్ని ఢీకొట్టి పక్కకు ఒరిగింది. అయితే వెనుకే వస్తున్న రెండో కారు
టిప్పర్ డీజిల్ ట్యాంక్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో రెండో కారులో ఉన్న నలుగురు సజీవదహనమయ్యారు. మొదటికారులో ఉన్నవారు గాయపడడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా వీరంతా తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. అంతేకాకుండా పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు.