https://oktelugu.com/

Saptapadi: పెళ్లిలో వధూవరులు ఏడడగులు ఎందుకు వేస్తారు..? వాటి అర్థం ఏంటి..?

Saptapadi: పెళ్లంటే నూరేళ్ల పంట. ఆ ఒక్కరోజు చేసే క్రతువు వందేళ్ల జీవితాన్ని కాపాడుతుంది. విభిన్న మతాలకు చెందిన వారు వారి వారి పద్ధతుల్లో పెళ్లిళ్లు జరిపించినా కలకాలం జీవించాలనే కోరుకుంటారు. కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిలో కాబోయే వారితో ఏడడుగులు నడిస్తే ఏడు జన్మలు కలిసున్నట్లేనని అంటారు. హిందూ వివాహాల్లో జరిగే పెళ్లిల్లో హోమం చుట్టూ కాబోయే దంపతులు ఏడడుగులు నడుస్తున్నారు. వారు వేసే ప్రతి అడుగు ప్రత్యేకమైనదే. ఒక్కో అడుగుకు ఒక్క […]

Written By:
  • NARESH
  • , Updated On : April 27, 2022 5:59 pm
    Follow us on

    Saptapadi: పెళ్లంటే నూరేళ్ల పంట. ఆ ఒక్కరోజు చేసే క్రతువు వందేళ్ల జీవితాన్ని కాపాడుతుంది. విభిన్న మతాలకు చెందిన వారు వారి వారి పద్ధతుల్లో పెళ్లిళ్లు జరిపించినా కలకాలం జీవించాలనే కోరుకుంటారు. కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిలో కాబోయే వారితో ఏడడుగులు నడిస్తే ఏడు జన్మలు కలిసున్నట్లేనని అంటారు. హిందూ వివాహాల్లో జరిగే పెళ్లిల్లో హోమం చుట్టూ కాబోయే దంపతులు ఏడడుగులు నడుస్తున్నారు. వారు వేసే ప్రతి అడుగు ప్రత్యేకమైనదే. ఒక్కో అడుగుకు ఒక్క మంత్రాన్ని అర్చకులు పఠిస్తుంటారు. అయితే పెళ్లికి వచ్చిన వదూవరులు వేసే అడుగులను చూస్తారు..కానీ ఆ అడుగుల వెనుక అర్చకులు చదివే మంత్రాలను పట్టించుకోరు. కానీ వాటికి ప్రత్యేకమైన విశేషం ఉంది. వారు జపించే వాటిలో ఒక్కో అడుగుకు పరమార్థం ఉంది. పెళ్లిలో వేసే ఆ ఏడడుగుల గూడార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

    మొదటి అడుగు:
    ‘ఏకం ఇషే విష్ణు: త్వా అన్వేతు’.. కాబోయే భర్త లేదా భార్యతో కలిసి అగ్ని సాక్షిగా మొదటి అడుగు వేస్తున్నాను. జీవితాంతం మన ఇద్దరిని కాపాడాలని ఆ విష్ణును కోరుకుంటున్నాం.

    Saptapadi

    Saptapadi

    Also Read: Minister RK Roja: దూకుడు పెంచి మంత్రి రోజా.. విపక్షాలపై విశ్వరూపం చూపిస్తున్న ఫైర్ బ్రాండ్

    రెండో అడుగు:
    ‘ద్వే పూర్ణే విష్ణు: త్వాత అన్వేతు’.. జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదురవుతాయి. వాటి నుంచి మమ్మల్ని గట్టెక్కించుగాక.. ఆ కష్టాలను ఎదుర్కోవడానికి మాకు శక్తి నివ్వండి స్వామి.

    మూడో అడుగు:
    ‘త్రీణి వ్రతాయ విష్ణు: త్వా అన్వేతు’.. మేము జరిపించే ఈ వివాహ వ్రతాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు విష్ణు..

    Saptapadi

    Saptapadi

    నాలుగో అడుగు:
    ‘చత్వారి మయోభవాయ విష్ణు: త్వా అన్వేతు’.. నిత్యం దు:ఖాలతో నిండిన జీవితాన్ని ఆనందాన్ని కలిగించాలని ఆ విష్ణువును వేడుకోవడం.

    ఐదో అడుగు:
    ‘పంచ పశుభ్యో విష్ణు: త్వా అన్వేతు’.. వ్యవసాయంలో భాగంగా పశు సంపదను ఇవ్వాలని విష్ణువును కోరడం..

    ఆరో అడుగు:
    ‘షడృతుభ్యో విష్ణ: త్వా అన్వేతు’.. ఆరు రుతువులు మనకు సుఖమిచ్చు గాక..

    ఏడో అడుగు:
    ‘సప్తభ్యో హోతాబ్యో విష్ణు: త్వా అన్వేతు’.. ఇంట్లో ధర్మ నిర్వహణకు విష్ణు అనుగ్రహం కలుగు గాక..

    Saptapadi

    Saptapadi

    ఇలా ఏడడుగులు ప్రత్యేక పరమార్థాలు కలిగి ఉన్నాయి. ఈ ఏడు ఆడుగులు జీవితాన్ని నిలబెట్టుతాయని అర్చకులు ఆశీర్వదిస్తారు. వివిధ వర్గాల్లో ఈ పెళ్లి క్రతువును ఆయా పద్ధతుల్లో చేస్తారు. కానీ హిందూ పద్దతిలో జరిగే వివాహాల్లో ఏడడగులు తప్పనిసరిగా ఉంటాయి. మారుతున్న కాలంలో పెళ్లిళ్లకు తక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈజీ మ్యారేజేస్ కు అలవాటు పడి కొన్ని శాస్త్రీయ పద్ధతులను మరిచిపోతున్నారు.

    Also Read:TRS Plenary: టీఆర్ఎస్ @ 21: కేసీఆర్ అడుగులు తెలంగాణ టు ఢిల్లీ

    Tags