Minister Kakani Meets Anil Kumar Yadav: వైసీపీకి మంచి పట్టున్న జిల్లాలో నెల్లూరు ఒకటి. గడిచిన ఎన్నికల్లో సంపూర్ణ విజయం అందించింది ఈ జిల్లా. కానీ ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు పార్టీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. నేతల మధ్య విభేదాలు తారాస్థాయి వెళ్లాయి. ముదిరిపాకాన పడుతున్నాయి. స్వయంగా సీఎం జగన్ కలుగజేసుకొనే స్థాయికి పంచాయితీలు నడిచాయి. ముఖ్యంగా తాజా మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి, తాజా మాజీ అనిల్ కుమార్ యాదవ్ ల మధ్య మాటల యుద్ధం, ఫ్లెక్సీలు తొలగింపు, పోటా పోటీ సమావేశాలు, ఒకరి నియోజకవర్గంలో ఒకరు బల ప్రదర్శన చేసి కాక రేపారు. రాష్ట్రస్థాయిలో హల్ చల్ చేశారు. అటువంటిది ఉన్నట్టుండి వారిద్దరూ సైలెంట్ అయిపోయారు.
అనిల్ ఇంటికి కాకాని వెళ్లారు. తేనేటి విందు రుచిచూశారు. తామిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని.. 2024 ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా మంత్రి కాకానిని అనిల్ కుమార్ యాదవ్ సన్మానం సైతం చేశారు. అయితే ఇన్నాళ్లూ పప్పు ఉప్పులా ఉన్న ఇద్దరు నేతల కలయిక మధ్య పెద్ద కథే నడిచింది. దీని వెనుక సీఎం జగన్ మార్క్ ట్రీట్ మెంట్ ఉందని.. అది బాగానే పనిచేసిందన్న టాక్ వైసీపీ లో నడుస్తోంది. సీఎం జగన్ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్న ముందు రోజే వీరిద్దరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చనీయాంశంగా మారింది.
Also Read: TRS Plenary: టీఆర్ఎస్ @ 21: కేసీఆర్ అడుగులు తెలంగాణ టు ఢిల్లీ
ప్రస్టేషన్ లో ఇద్దరు..
జగన్ తన తొలి కేబినెట్ లో అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకున్నారు. రెడ్డి సామాజికవర్గాన్ని కాదని యాదవ సామాజికవర్గానికి చెందిన అనిల్ యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు. ఇది సహజంగా మిగతా రెడ్డి ఎమ్మెల్యేలకు నచ్చలేదు. అనిల్ కు మంత్రిగా ఏనాడూ గుర్తించలేదు సరికదా సహకరించలేదు. దీనిని మనసులో పెట్టుకున్నారు అనిల్. కానీ మంత్రిగా ఉన్నన్నాళ్లూ బయటపెట్టలేదు. సరిగ్గా మూడేళ్లు పూర్తయిన తరువాత అనిల్ ను తప్పించి కాకాని గోవర్థన్ రెడ్డిని జగన్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. దీంతో ఇన్నాళ్లూ తమను తొక్కిన అనిల్ పై కాకాని, మూడేళ్ల పాటు మంత్రిగా ఉన్నా సహకరించని కాకానిపై అనిల్ తమ ప్రస్టేషన్ ను బయట పెట్టుకున్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి కాకాని జిల్లాలో అడుగు పెట్టిన రోజునే అనిల్ కుమార్ యాదవ్ పోటీ సభ పెట్టారు.
కాకాని స్వాగత వేడుకలకు ఎవరూ వెళ్లొద్దని హుకుం జారీచేశారు. అంతటితో ఆగకుండా స్వాగత ఫ్లెక్సీలను సైతం తీసివేయించారు. అటు కాకాని గోవర్థన్ రెడ్డి తన పంథాను మార్చారు. అనిల్ కుమార్ కు వ్యతిరేకంగా ఆనం రామనారాయణరెడ్డితో చేతులు కలిపారు. అనిల్ ను ఏకాకి చేశారు. అయితే వరుస పరిణామాలు వైసీపీ అధిష్టానానికి కలవరపెట్టాయి.జిల్లా వైసీపీలో గ్రూపులుగా ఏర్పడటం పైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో..సీఎం క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా తాజా – మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి – అనిల్ కు పిలుపు అందింది. ఇద్దరితోనూ సీఎం జగన్ మాట్లాడారు. బయటకు వచ్చిన నేతలు అసలు తమ మధ్య విభేదాలు లేవని ప్రకటించుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ..సరిగ్గా సీఎం అధ్యక్షతన పార్టీ కీలక సమావేశానికి ముందు రోజున మంత్రి కాకాని.. అనిల్ కుమార్ యాదవ్ ఇంటికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇద్దరూ దాదాపు 15 నిమిషాలు మాట్లాడుకున్నారు. మంత్రి అయిన తరువాత తొలి సారి తన నివాసానికి వచ్చిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి అనిల్ స్వాగతం పలికారు. సత్కరించారు. ఇక నుంచి జిల్లాలో డెవలప్ మెంట్ తో పాటుగా 2024 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావటమే లక్ష్యంగా తాము పని చేస్తామని ఇద్దరు నేతలు ప్రకటించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ నేతలను కలుస్తున్నానని..అందులో భాగంగానే అనిల్ నివాసానికి వచ్చానని కాకాణి చెప్పుకొచ్చారు.
కలవని మనసులు
నేతలిద్దరూ కలిశారు. కానీ వారి మనసులు కలిశాయా? అన్నదే ప్రశ్న. ఇద్దరు నేతలు ఇప్పుడు కలుసుకోవటం ద్వారా పూర్తిగా కోల్డ్ వార్ కు ముగింపు పలికినట్లేనా..లేక, మనుషులు కలిసినా..మనసులు మాత్రం దూరంగానే ఉన్నాయా అనేది ఇప్పుడు నెల్లూరు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.ఎందుకుంటే ఇద్దరు నేతలు చాలా దూరంగా వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఒకరిని ఒకరు చెక్ చెప్పుకునేటంతగా వ్యూహాలు రూపొందించుకున్నారు. దాదాపు అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ ఉన్న నేతలను దూరం చేసే పనిలో పడ్డారు కాకాని. ఇందుకు అనం కుటుంబీలను తెరపైకి తెచ్చారు. నెల్లూరు సిటీలో అనిల్ కు దీటుగా ఆనం కుటుంబసభ్యలను తెరపైకి తెచ్చి పోటీ చేయించాలని స్కెచ్ వేశారు. అదే సమయంలో కాకానిని రాజకీయంగా దెబ్బతీయాలని అనిల్ నిర్ణయించుకున్నారు. అనిల్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గీయుల ఇంట్లో పండుగలు, శుభకార్యాలకు మందీ మార్భలంతో హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు కొల్లగొడతానని గట్టి హెచ్చరికలే పంపారు. ఇంతలో ఉన్నపలంగా సీఎం జగన్ నుంచి కబురు రావడంతో ఇద్దరూ నేతలు వేర్వేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. అక్కడ ఎటువంటి వార్నింగ్ వచ్చిందో కానీ.. ఇప్పడు బంధువులు వలే కలిసిపోయారు. తామిద్దరం ఒకటేనని చెప్పకొస్తున్నారు.
Also Read: Electricity Bill: విద్యుత్ బిల్లు తగ్గించుకోవాలంటే ఈ ట్రిక్కులు పాటించాల్సిందేనా?