Sapota Fruit Benefits: ఎండాకాలం వచ్చిందంటే మామిడిపండ్ల సీజన్ మొదలవుతుంది. తాటి ముంజలు.. ఈత పండ్లు.. నేరేడు పండ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతి ప్రసాదించిన వరాలు చాలానే లభిస్తాయి. వీటిల్లో ఈ పండు మాత్రం చాలా ప్రత్యేకం. అయితే ఇది చూసేందుకు అంత అందంగా ఉండదు. పైగా దాని మీద ఉన్న తొక్క కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. వాసన మాత్రం అదిరిపోతుంది. ఒక ముక్క నోట్లో పెట్టుకుంటే చాలు.. అదే పనిగా తినాలి అనిపిస్తుంది. ఎండాకాలంలో మాత్రమే దొరికే ఈ పండులో పోషకాలు విపరీతంగా ఉంటాయి.
ప్రకృతి ప్రసాదించిన వరాలలో సపోటా పండు చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఇది విస్తారంగా పండుతూ ఉంటుంది. ఎండాకాలంలో మాత్రమే ఈ పండు లభ్యం అవుతు ఉంటుంది. సపోటాలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇది తినడానికి అత్యంత తీయగా ఉంటుంది. ఇది ఎండాకాలంలో అలసట మొత్తాన్ని దూరం చేస్తుంది. విటమిన్ కే ను శరీరానికి అందిస్తూ ఉంటుంది. జీర్ణ క్రియను పెంపొందిస్తూ ఉంటుంది. రోగ నిరోధక శక్తిని మెరుగుపడేలా చేస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. దీంట్లో ఉండే సహజమైన చక్కెరలు శరీరానికి సత్వర శక్తిని అందిస్తుంటాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల జీర్ణక్రియ సాఫీగా సాగిపోతూ ఉంటుంది.
సపోటా పండ్లలో సహజ చెక్కరలు అధికంగా ఉంటాయి. ఇవి మధుమేహరోగులకు అంత మంచివి కాదు. గుండె జబ్బులతో బాధపడే వారు కూడా వైద్యుల సలహా మేరకు వీటిని తీసుకోవాలి. అయితే చాలామంది సపోటా పండ్లను నేరుగా కాకుండా.. రసం చేసుకుని తాగుతూ ఉంటారు. దీనిలో కొన్ని పాలు కలిపి.. అందులో ఎండు ఫలాలు.. ఇతర మిశ్రమాలు కలిపి సపోటా కాక్టైల్ మాదిరిగా చేస్తుంటారు. ఇది తాగడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. ఎండాకాలంలో సత్తువ కోల్పోయిన శరీరానికి ఇది సత్వర శక్తిని అందిస్తూ ఉంటుంది. సపోటా పండ్లల్లో విటమిన్ కే అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తం గడ్డ కట్టడంలో సహాయపడుతుంది. విటమిన్ కే సమృద్ధిగా ఉంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్తస్రావాన్ని తగ్గిస్తుంది.
సపోటా పండ్లల్లో సహజమైన లాటిక్స్ ఉంటాయి. వీటి ద్వారా గమ్స్.. సహజమైన జిగురు ఉత్పత్తులను తయారు చేస్తుంటారు. వీటి ఆకులను గాయాలు మానడానికి ఉపయోగిస్తుంటారు. సపోటా చెట్టు వేళ్ళు కూడా ఔషధ విలువలు కలిగి ఉంటాయి. వాటిని ఎండబెట్టి.. దంచి చూర్ణం లాగా చేసుకుని తాగితే వాతం తగ్గిపోతూ ఉంటుంది. జీర్ణ క్రియ మెరుగ్గా ఉంటుంది.
గమనిక
సపోటా పండ్లు మధుమేహ రోగులకు మంచివి కావు. వీటిని తినాలి అనుకుంటే వైద్యుల సలహాలు తీసుకోవాలి. గుండె జబ్బులు ఉన్నవాళ్లు కూడా సపోటా పండ్లను వైద్యుల సలహాల మేరకు తీసుకోవాలి. ఈ కథనం వివిధ వేదికల వద్ద సేకరించిన సమాచారం ఆధారంగా పాఠకుల కోసం రూపొందించాం. వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఈ కథనాన్ని పరిశీలించకూడదని పాఠకులకు విన్నవిస్తున్నాం.