Homeఆంధ్రప్రదేశ్‌YS Bharati Reddy: వైఎస్ భారతి న్యాయపోరాటం

YS Bharati Reddy: వైఎస్ భారతి న్యాయపోరాటం

YS Bharati Reddy: వైఎస్ భారతి రెడ్డి( y s Bharati Reddy ) న్యాయపోరాటం ప్రారంభించారు. సోషల్ మీడియాలో తనతో పాటు తన కుటుంబం పై దుష్ప్రచారం చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండిస్తున్నారు. కొన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అదే పనిగా తనపై జరుపుతున్న దుష్ప్రచారాన్ని గుర్తుచేస్తూ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. థింక్ ఆంధ్ర తో పాటు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె ఫిర్యాదు చేయడం విశేషం. సమాజంలో తనతో పాటు కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఆ యూట్యూబ్ ఛానల్స్ ను నిషేధించాలని ఆమె కోరారు. న్యాయ పోరాటానికి సైతం ఆమె సిద్ధపడ్డారు. డిజిటల్ మీడియా సరే.. రాజకీయ ప్రత్యర్థులపై భారతీయ నిర్వహిస్తున్న మీడియా పై ఏ చర్యలు తీసుకోవాలి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

* సోషల్ మీడియాలో వైరల్..
ఇటీవల థింక్ ఆంధ్ర( Think andra ) పేరుతో సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. అవి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. కూటమికి మద్దతుగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా థింక్ ఆంధ్ర గట్టిగానే కథనాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. అయితే అది జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బందికి గురిచేస్తోంది. అందుకే భారతి రెడ్డి ఇప్పుడు ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమెతోనే ఫిర్యాదు ఇప్పించినట్లు స్పష్టం అవుతోంది. ఒక్క థింక్ ఆంధ్ర పై మాత్రమే కాదు వ్యతిరేక డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై ఆమె పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం.. న్యాయ పోరాటానికి దిగడం సంచలనంగా మారింది.

* అప్పట్లో వ్యతిరేక ప్రచారం..
భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య. ప్రస్తుతం సాక్షి మీడియా ( Sakshi media) నిర్వహణ బాధ్యతలు ఆమె చూస్తున్నట్లు తెలుస్తోంది. అలా అయితే చంద్రబాబు ఫ్యామిలీ పై దుష్ప్రచారం చేసిన డిజిటల్ మీడియాను ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పై వ్యతిరేక ప్రచారం చేసిన మీడియాను ఏం చేయాలి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా కొంతమంది వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. అటువంటి వారికి అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారం ఉందన్న ఆరోపణలు కూడా ఉండేవి. మరోవైపు సాక్షి మీడియాలో రాజకీయ ప్రత్యర్థులను వెంటాడటమే పనిగా పెట్టుకున్నారు. మరి ఆ మీడియాను నిర్వహిస్తున్న భారతి రెడ్డికి అప్పట్లో అవి కనిపించలేదా అనే ప్రశ్న ఉత్పనం అవుతోంది. ఏదైనా తమ వరకు వచ్చే వరకు తెలియదని.. ఇప్పుడు భారతి రెడ్డితో పాటు జగన్ ఫ్యామిలీ బాధ్యత వర్గంగా మారేసరికి ఇవన్నీ గుర్తుకొచ్చాయా అని ఎక్కువ మంది నిలదీస్తున్నారు. సోషల్ మీడియా అంటేనే వైసిపి గుర్తుకొస్తుంది. అంతలా పార్టీకి సోషల్ మీడియా కాలకేయ సైన్యం ఉంది. అది మరచి ఇప్పుడు తమపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారిపై భారతి రెడ్డి ఫిర్యాదులు చేస్తుండడం.. న్యాయపోరాటం చేస్తుండడం పై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version