Safe Alcohol Consumption: మద్యపానం హానికరం అని పెద్దపెద్ద బోర్డులు కనిపిస్తూ ఉన్నా.. మద్యం సేవించే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అందుకు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. కొందరు ఒత్తిడిని తగ్గించుకోవడానికి మద్యం సేవిస్తున్నామని చెబుతున్నారు. మరికొందరు మనసు ప్రశాంతంగా ఉండడానికి లేదా ఒళ్ళు నొప్పులు తగ్గడానికి మద్యం తాగుతున్నామని చెబుతారు. ఎవరైనా మద్యం తాగిన ఒక క్రమ పద్ధతిలో మద్యం సేవించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాస్తవానికి మద్యం తాగడం శరీరానికి హానికరమే. కానీ దీని నుంచి తప్పించుకోలేని వారు క్రమ పద్ధతిలో మద్యం సేవించడం వల్ల కొంతవరకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందని తెలుపుతున్నారు. మరి మధ్యలో క్రమ పద్ధతిలో అంటే ఎలా తీసుకోవాలి? ఆ తర్వాత ఏం చేయాలి?
మద్యం తాగే సమయంలో కొందరు తమకు మత్తు ఎక్కువగా ఉండాలని అనుకుంటారు. దీంతో ఎక్కువ మొత్తంలో మద్యం తాగాలని అనుకుంటారు. అయితే అంతకుముందు శరీరంలో ఎలాంటి ఆహారం లేకపోతే చాలా కష్టమవుతుంది. అందువల్ల మద్యం తాగేముందు ఎంతో కొంత ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం తీసుకున్న తర్వాత మద్యం తాగడానికి వెళ్లడం హానికరం కాకుండా ఉంటుంది. అలాగే మద్యం తాగడానికి వెళ్లేముందు కనీసం ఒక గ్లాస్ నీరు తీసుకోవాలి. ముందుగానే శరీరంలో నీరు ఉండడంవల్ల డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది.
Also Read: Hostel Hygiene Issue: అనితమ్మ మీ కంచంలోనే బొద్దింక వస్తే.. ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటో?
ఇక మద్యం తాగే ప్రదేశానికి వెళ్లిన తర్వాత లిక్కర్ తీసుకునే వారు అయితే అందులో కచ్చితంగా నీరు ఉండే విధంగా చూసుకోవాలి. కొందరు తక్కువ మోతాదులో నీటిని కలుపుకుంటూ ఉంటారు. అలా కాకుండా కాస్త ఎక్కువగానే నీటిని యాడ్ చేయాలి. ఎందుకంటే ఆల్కహాల్ను డైజేషన్ చేయడానికి నీరు ఎక్కువగా ఉండటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మద్యం తాగే సమయంలో చిన్నచిన్నగా స్విఫ్ట్ చేయాలి. కొందరు ఆ మధ్యాహ్నం ఎవరో తీసుకెళ్తారు అన్నట్లుగా ఒక్కటే సారి గ్లాసు లాగించేస్తుంటారు. ఇలా తాగడం ఎంత మాత్రం సేఫ్ కాదు.
మద్యం తాగుతున్న సమయంలో ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్త పడాలి. ప్రతి sip కు మధ్య కచ్చితంగా ఆహారాన్ని తీసుకోవాలి. ఇది కాస్త డైజేషన్ అయ్యేవిధంగా ఉంటే చాలా బెటర్. ఎట్టి పరిస్థితుల్లో ఆహారం తినడం ఆపేయొద్దు. దాదాపు ఎక్కువ మోతాదులోనే ఆహారం తీసుకోవడం వల్ల ఆల్కహాల్ ప్రభావం శరీరం పై పడకుండా ఉంటుంది. ఇక మద్యం రెండోసారి యాడ్ చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ మోతాదులో నీటిని కలుపుకుంటూ ఉండాలి. అయితే కొందరు గ్లాసులోని మద్యం సగం తాగిన తర్వాత కూడా మళ్లీ నీటిని కలుపుకుంటే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది.
Also Read: Raja Saab Item Song: రాజా సాబ్’ మూవీ లో స్టార్ హీరో భార్య ఐటెం సాంగ్!
ఇక మద్యం తాగిన మరుసటి ఉదయం కొందరు హ్యాంగోవర్ కు గురవుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఉదయం టీ, కాఫీ లాంటివి కాకుండా నిత్యం నీటిని తీసుకుంటూ ఉండాలి. అలాగే బ్రేక్ ఫాస్ట్ కు టిఫిన్ కాకుండా ఏదైనా పాపయ్య, ఇతర ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. వీటితోపాటు మధ్యాహ్నం వరకు నీటిని తీసుకోవడం వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.