UPI Payments : భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. యూపీఐ కేవలం పెద్దలకు మాత్రమే పరిమితం కావడం లేదు. పిల్లలు కూడా దీనిని ఉపయోగించేలా కొత్త మార్గాలు వస్తున్నాయి. అలాగే, ఇతర యూపీఐ సంబంధిత విషయాలు కూడా నిత్యం వార్తల్లో ఉంటున్నాయి. ఈ ట్రెండ్స్ వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, యూపీఐలో వస్తున్న సరికొత్త మార్పుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఇప్పటివరకు యూపీఐ అంటే పెద్దలు మాత్రమే వాడేదని అనుకున్నాం. కానీ ఇప్పుడు పిల్లలు కూడా యూపీఐ పేమెంట్స్ చేసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా, యూపీఐ సర్కిల్ అనే కొత్త ఫీచర్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. దీనివల్ల తల్లిదండ్రులు తమ బ్యాంక్ అకౌంట్‌ను లింక్ చేసి, పిల్లలకు కొన్ని లిమిట్స్ లో డబ్బులు వాడే అవకాశం ఇవ్వొచ్చు. పిల్లలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనీ సెండ్ చేయవచ్చు. కానీ వారికి మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు గానీ లేదా యూపీఐ పిన్ తెలియదు. అంటే, పూర్తి కంట్రోల్ లో ఉంటారు. పిల్లలు ఖర్చు చేసేటప్పుడు వారికి బాధ్యత నేర్పడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
Also Read: హిందీ ‘రామాయణం’ టీజర్ రెడీ..విడుదల తేదీ ఖరారు..ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్!
పిల్లలకు 15 ఏళ్లు నిండి, వారి పేరు మీద సొంత బ్యాంక్ ఖాతా ఉంటే, వారికి సొంత యూపీఐ ఐడీ కూడా తీసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు 10 ఏళ్ల పిల్లలకు కూడా అకౌంట్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాయి. అయితే, తల్లిదండ్రుల పాన్ కార్డ్ వంటి డాక్యుమెంట్లు అవసరమవుతాయి. ఒకసారి యూపీఐ ఐడీ యాక్టివ్ అయితే, వారు స్వతంత్రంగా డబ్బులు పంపగలరు, స్వీకరించగలరు. సాధారణంగా, వారికి రోజుకు లక్ష రూపాయల వరకు లిమిట్ ఉంటుంది. అయితే, చాలా మంది పేరెంట్స్ ఇప్పటికీ యూపీఐ సర్కిల్‌నే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే, దీనివల్ల పిల్లలకు డిజిటల్ యాక్సెస్ ఇస్తూనే వారి ఖర్చులను పర్యవేక్షించవచ్చు.
యూపీఐ సర్కిల్‌ను సెటప్ చేయడం చాలా తేలిక. మీరు గూగుల్ పే లేదా భీమ్ యా ఓపెన్ చేసి, మీ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయాలి. అక్కడ యూపీఐ సర్కిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి యాడ్ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు మీరు మీ పిల్లల యూపీఐ ఐడీని ఎంటర్ చేయవచ్చు లేదా వారి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. తర్వాత, మీరు మీ పిల్లలకు ఎంత డబ్బు ఖర్చు చేయడానికి అనుమతించాలనుకుంటున్నారు లేదా ప్రతి పేమెంట్‌కు మీ పAర్మీషన్ కావాలా అనేది ఎంచుకోవచ్చు. చివరిగా, మీ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే సెటప్ పూర్తవుతుంది.
మీ పిల్లలకు 15 ఏళ్ల లోపు ఉండి, సొంత బ్యాంక్ ఖాతా లేకపోతే, యూపీఐ సర్కిల్ వాడటం మంచిది. ఒకవేళ మీ పిల్లలకు 15 ఏళ్లు పైబడి, వారి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉంటే, వారికి సొంత యూపీఐ ఐడీ తీసుకోవచ్చు లేదా యూపీఐ సర్కిల్‌తో లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వొచ్చు. ఏదేమైనా, యూపీఐ మన డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ మరింత సులభతరం చేస్తోంది.