Reusing Cooking Oil: వాడిన నూనెను మళ్లీమళ్లీ వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్..!

Reusing Cooking Oil: ఏ సందర్భం అయినా ఇంట్లో వంటకాలు చేయడం సాధారణంగా జరుగుతుంది. ఇంట్లో చేసే వంటల కోసం వంటనూనెను తప్పనిసరిగా వినియోగించాల్సిందే. నూనె వేయకుండా ప్రస్తుత కాలంలో ఏ వంటను చేయలేము. అయితే చాలామంది వాడిన నూనెనే మళ్లీ వాడుతూ ఉంటారు. అయితే వైద్య నిపుణులు మాత్రం వాడిన నూనెను మళ్లీమళ్లీ వాడటం ప్రమాదకరం అని చెబుతున్నారు. పూరీలు, పరాఠాలు, బజ్జీలు మిగతా వంటకాల కోసం ఎక్కువగా వాడిన నూనెను మళ్లీ వినియోగించడం జరుగుతుంది. […]

Written By: Navya, Updated On : September 4, 2021 11:06 am
Follow us on

Reusing Cooking Oil: ఏ సందర్భం అయినా ఇంట్లో వంటకాలు చేయడం సాధారణంగా జరుగుతుంది. ఇంట్లో చేసే వంటల కోసం వంటనూనెను తప్పనిసరిగా వినియోగించాల్సిందే. నూనె వేయకుండా ప్రస్తుత కాలంలో ఏ వంటను చేయలేము. అయితే చాలామంది వాడిన నూనెనే మళ్లీ వాడుతూ ఉంటారు. అయితే వైద్య నిపుణులు మాత్రం వాడిన నూనెను మళ్లీమళ్లీ వాడటం ప్రమాదకరం అని చెబుతున్నారు. పూరీలు, పరాఠాలు, బజ్జీలు మిగతా వంటకాల కోసం ఎక్కువగా వాడిన నూనెను మళ్లీ వినియోగించడం జరుగుతుంది.

మనం వాడిన నూనెలో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచడంతో పాటు బీపీ, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచటానికి కారణమవుతుంది. వాడిన వంటనూనెను మళ్లీ వాడటం వల్ల పార్కిన్సన్స్, కాలేయ సమస్యలు, ఆల్జీమర్స్, స్ట్రోక్, క్యాన్సర్, ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. తరచుగా గ్యాస్ వస్తే అందుకు వంట నూనె కారణం అని చెప్పవచ్చు.

బయట ఆహారం ఎక్కువగా తినడం వల్ల కూడా ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. హై బీపీతో బాధ పడేవాళ్లు వాడిన వంటనూనె వాడకాన్ని తగ్గిస్తే మంచిది. వాడిన వంటనూనెను మళ్లీ వాడటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం. వంట చేసే సమయంలో వంటకు సరిపడా నూనెను మాత్రమే వినియోగించాలి.

పొద్దుతిరుగుడు, ఆవాలు, సోయాబీన్ నూనె, వేరుశెనగ లేదా నువ్వుల నూనెను వినియోగిస్తే మంచిది. వాడిన నూనెను మళ్లీ వాడటం మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వంటనూనెల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనేక అరోగ్య సమస్యల బారిన పడకుండా రక్షించుకోవచ్చు.