Devotional tips: పండితులలో చాలామంది గుడికి దగ్గర్లో ఇల్లు కట్టుకోకూడని చెబుతూ ఉంటారు. కొందరు ఈ విషయాలను నమ్మితే మరి కొందరు మాత్రం నమ్మడానికి అస్సలు ఇష్టపడరు. అయితే గుడికి దగ్గరలో ఇల్లు కట్టుకోవడం మంచి నిర్ణయం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం విష్ణు దేవుని గుడి వెనుక ఇంటిని కట్టుకుంటే మంచి ఫలితాలు రావు. ఒకవేళ ఇంటిని కట్టుకోవాల్సి వస్తే 10 నుంచి 20 అడుగుల దూరం పాటిస్తే మంచిది.
శక్తి ఆలయాలకు ఇరు వైపులా ఇల్లు కట్టుకోవడం మంచిది కాదు. ఒకవేళ తప్పనిసరిగా ఇల్లు కట్టుకోవాలని భావిస్తే మాత్రం 120 అడుగుల దూరం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇతర దేవుళ్ల ఆలయాలు ఉంటే కనీసం 80 అడుగుల దూరం పాటించి ఇల్లు కట్టుకుంటే మంచిది. గ్రామ దేవతలు, అమ్మవారు, శివుడి గుడికి ఎదురుగా ఇల్లు కట్టుకోవడం కూడా మంచిది కాదు.
Also Read: Prabhas: ప్రభాస్ వల్ల అట్టర్ ఫ్లాప్ అయిన ఎన్టీఆర్ మూవీ ఏమిటో తెలుసా..?
ప్రాచీన గ్రంథాలలో వెల్లడించిన విషయాల ప్రకారం శివుని నీడ ఇంటిపై పడటం మంచిది కాదు. ఇంటిపై ధ్వజస్తంభం నీడ పడినా కూడా నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. పురాణాలలో ధ్వజస్తంభానికి ఎదురుగా ఇల్లు కట్టుకోవడం వల్ల హాని జరుగుతుందని పేర్కొన్నారు. కొత్తగా ఇంటిని కొనుగోలు చేసేవాళ్లు గుడికి దూరంగా ఇంటిని కొనుగోలు చేస్తే మంచిది.
గుడికి దగ్గర్లో ఇల్లు కట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా గుడికి వెళ్లి దేవుడికి కష్టాలను చెప్పుకుని ఆ కష్టాల నుంచి రక్షించాలని కోరుకుంటాం. అయితే గుడికి దగ్గరలో ఇల్లు కట్టుకోవడం మంచిది కాదు.
Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి సినిమానా మజాకా.. ఏకంగా చెప్పుల షాప్ పేరు మారిందిలా!
Recommended Videos: