https://oktelugu.com/

Acharya Movie First Review: ఆచార్య మూవీ ‘ఫస్ట్’ రివ్యూ.. హిట్టా ఫట్టా?

Acharya Movie First Review: ఇప్పుడు టాలీవుడ్ అంతా ఆచార్య మూవీ చుట్టూ తిరుగుతోంది. అటు మీడియాలో, ఇటు సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఆచార్య వేవ్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రోజుకో స‌స్పెన్స్ థ్రిల్లింగ్ న్యూస్‌తో హైప్ తీసుకువ‌స్తున్నారు ఆచార్య మేక‌ర్స్‌. ఇక ఇందులో మొద‌టి సారి చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్నారు. ఇద్ద‌రూ క‌లిసి ఫుల్ లెంగ్త్ రోల్ లో న‌టిస్తున్న మొద‌టి మూవీ ఇదే. దాంతో అంచ‌నాలు ఆకాశంలోనే ఉన్నాయి. ఇక స‌క్సెస్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 22, 2022 / 03:13 PM IST
    Follow us on

    Acharya Movie First Review: ఇప్పుడు టాలీవుడ్ అంతా ఆచార్య మూవీ చుట్టూ తిరుగుతోంది. అటు మీడియాలో, ఇటు సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఆచార్య వేవ్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రోజుకో స‌స్పెన్స్ థ్రిల్లింగ్ న్యూస్‌తో హైప్ తీసుకువ‌స్తున్నారు ఆచార్య మేక‌ర్స్‌. ఇక ఇందులో మొద‌టి సారి చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్నారు. ఇద్ద‌రూ క‌లిసి ఫుల్ లెంగ్త్ రోల్ లో న‌టిస్తున్న మొద‌టి మూవీ ఇదే.

    Chiranjeevi

    దాంతో అంచ‌నాలు ఆకాశంలోనే ఉన్నాయి. ఇక స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న మూవీ కావ‌డంతో ఈ మూవీ హిట్ గ్యారెంటీ అని భ‌రోసా వ్య‌క్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్‌. ఇప్ప‌టికీ రిలీజ్ అయిన పోస్ట‌ర్లు, పాట‌లు విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక ఈ మూవీకి సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో వాయిస్ ఓవ‌ర్ ఇప్పించ‌డం హైలెట్ గా నిలుస్తోంది.

    Also Read: Bommala Koluvu: రివ్యూ : – ‘బొమ్మ‌ల‌కొలువు’

    మొద‌టి సారి తెర‌మీద చిరు, చ‌ర‌ణ్ ల యాక్టింగ్ చూడాల‌ని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 29వ వ‌స్తున్న ఈ మూవీకి సెన్సార్ రివ్యూ వ‌చ్చేసింది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు ప్ర‌ధానంగా ఉండ‌టంతో పాటు సినిమాలో ఎక్కువ‌గా రక్త పాతం సీన్లు ఉండ‌టం వ‌ల్ల మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు.

    Acharya Movie First Review

    ఇందులో చిరు, చ‌ర‌ణ్‌ల యాక్ష‌న్ స‌న్నివేశాలు ఆద్యంతం ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయ‌ని సెన్సార్ వాళ్ల టాక్‌. ఇందులో ఎక్కువ‌గా హైంద‌వ సాంప్ర‌దాయాల‌కు ప్రాధాన్యత ఇస్తూ.. ధ‌ర్మ‌స్థ‌లిని కాపాడేందుకు జ‌రిగే పోరాటం చుట్టూ క‌థ ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇలా సినిమాకు పాజిటివ్ గానే సెన్సార్ టాక్ వ‌చ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

    మొత్తంగా చూసుకుంటే సినిమాలో యాక్ష‌న్ సన్నివేశాలు ఎక్కువ‌గానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇందులో సాంప్ర‌దాయాల‌ను కాపాడే పోరాట‌మే ప్ర‌ధానంగా ఉండ‌నున్న‌ట్టు సెన్సార్ టాక్‌ను బ‌ట్టి తెలుస్తోంది. మ‌రి సినిమా ఇంకెలా ఉంటుందో తెలియాలంటే 29 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

    Also Read:Jr NTR: ఆ హీరో స్ఫూర్తితోనే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష..!

    Recommended Videos:

    Tags