Salt: ఈ ఉప్పుతో లక్షలాది మంది ప్రాణాలు కాపాడవచ్చట.. ఎలా అంటే..?

Salt: ప్రతి వంటింట్లో వంటకాల్లో ఉప్పును వినియోగిస్తారు. ఉప్పు (salt) ఎక్కువగా తింటే రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటుతో బాధ పడేవాళ్లకు భవిష్యత్తులో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు సైతం ఉంటాయి. అయితే ఉప్పు లేని వంటలను తినడం మాత్రం సులభం కాదు. ఉప్పులో సోడియం క్లోరైడ్ ను తగ్గించి పొటాషియం క్లోరైడ్ ను పెంచడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ద జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు […]

Written By: Navya, Updated On : September 1, 2021 4:45 pm
Follow us on

Salt: ప్రతి వంటింట్లో వంటకాల్లో ఉప్పును వినియోగిస్తారు. ఉప్పు (salt) ఎక్కువగా తింటే రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటుతో బాధ పడేవాళ్లకు భవిష్యత్తులో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు సైతం ఉంటాయి. అయితే ఉప్పు లేని వంటలను తినడం మాత్రం సులభం కాదు. ఉప్పులో సోడియం క్లోరైడ్ ను తగ్గించి పొటాషియం క్లోరైడ్ ను పెంచడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ద జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను చెప్పుకొచ్చారు. స్వతంత్ర వైద్య పరిశోధన సంస్థ అయిన ఈ సంస్థ అధ్యయనం చేసి ఉప్పులో పొటాషియం క్లోరైడ్ ను పెంచడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తేల్చింది. రక్తపోటు, గుండెపోటు, అకాల మరణం లాంటి సమస్యలకు ఈ విధంగా చేయడం ద్వారా సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

శాస్త్రవేత్త బ్రూస్‌ నీల్‌ మాట్లాడుతూ కొత్తరకం ఉప్పును అందరూ వాడటం మొదలుపెడితే బాగుంటుందని అన్నారు. ఉప్పుకు ప్రత్యామ్నాయాలను వినియోగించడం ఖరీదైన వ్యవహారం అని ప్రభుత్వాలు సోడియం క్లోరైడ్‌ తక్కువగా, పొటాషియం క్లోరైడ్‌ ఎక్కువగా ఉండే ఉప్పును ప్రోత్సహిస్తే మంచిదని బ్రూస్ నీల్ అభిప్రాయపడ్డారు. కొత్తరకం ఉప్పును కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు మినహా మిగిలిన వాళ్లు వినియోగించుకోవచ్చని బ్రూస్ నీల్ వెల్లడించారు.

21,000 మందిపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను చెప్పుకొచ్చారు. కొత్తరకం ఉప్పు వాడిన వాళ్లలో సిస్టోలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌ గణనీయంగా తగ్గిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్తరకం ఉప్పును వాడిన వాళ్లలో సిస్టోలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌ 4.6 యూనిట్లు తగ్గిపోయినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.