Homeఎంటర్టైన్మెంట్Shah Rukh Khan and Nayanthara: 'షారుఖ్'తో నయనతార.. ముహూర్తం ఫిక్స్...

Shah Rukh Khan and Nayanthara: ‘షారుఖ్’తో నయనతార.. ముహూర్తం ఫిక్స్ !

Shah Rukh Khan and NayantharaShah Rukh Khan and Nayanthara: ‘రాజారాణి, పోలీస్, అదిరింది, విజిల్’ ఇలా తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ చేసిన తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీకి ( Atlee) నేషనల్ వైడ్ గా మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఈ జనరేషన్ లో ఇంత తక్కువ టైంలో ఎక్కువ పేరు వచ్చిన యుంగ్ డైరెక్టర్స్ లో అట్లీ తప్ప, మరొకరు లేరు. అందుకే అట్లీ అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కూడా వెర్రి అభిమానం చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కూడా అట్లీతో సినిమా చేయడానికి సన్నద్ధం అయ్యాడు. కానీ మధ్యలో ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది. కానీ, షారుఖ్‌- అట్లీ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. సెప్టెంబర్‌ 13న నుండి 10 రోజుల పాటు పుణెలో ఈ చిత్రం చిత్రీకరణ జరగనుంది.

ఇక ‘లేడీ సూపర్ స్టార్ నయనతార’ ఈ సినిమాతో మొదటిసారి బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో షారుఖ్‌ పాత్ర ద్విపాత్రాభినయం, అంటే సీనియర్ షారుఖ్‌ సరసన ఈ సౌత్‌ లేడీ సూపర్‌స్టార్‌ నటిస్తోంది. అయితే, నయనతార అంటేనే భారీ రెమ్యునరేషన్‌. కాగా నయనతార ఈ హిందీ డెబ్యూ కోసం రూ.6 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ ను అడిగిందట.

అట్లీ – షారుఖ్ సినిమా కాబట్టి, రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గరు. ఆమె ఆడినంత ఇవ్వడానికి మేకర్స్ అంగీకరించారు. ఈ క్రమంలోనే నయనతార ఈ సినిమా చేస్తోంది. ఆమె కూడా ఈ సినిమా షెడ్యూల్ లో పాల్గొనబోతుంది. కానీ, ఇప్పటికైతే ఈ వార్తల పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

కాకపోతే నయనతార గతంలో అట్లీతో ‘రాజారాణి’ సినిమా చేసింది, అప్పటి నుండి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అసలు అట్లీ అంటేనే క్రేజ్. ఓ దశలో ఎన్టీఆర్ కూడా స్వయంగా అట్లీకి ఫోన్ చేసి, మనం కలిసి ఓ సినిమా చేద్దామని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడంటనే అట్లీ రేంజ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version