Benefits of eating less rice: మనిషి ఆరోగ్యానికి అసలు ఏది తినాలి? ఈ ప్రశ్న చాలా మందిని వెంటాడుతుంది. అన్నం తినాలా? చపాతీలు అలవాటు చేసుకోవాలా? పండ్లు ఫలాలు తినాలా? ఫాస్ట్ ఫుడ్ తినాలా? ఇలా రకరకాల ప్రశ్నల అందరిలోనూ వస్తాయి.. కానీ కరెక్ట్ సమాధానం మాత్రం ఎవ్వరి దగ్గరా దొరకదు..
మనిషి ఆరోగ్యానికి సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. అయితే నాటి నుంచి నేటి వరకు సాంప్రదాయ ఉత్పత్తులు అయిన బియ్యం, గోధుమలు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. వీటిని తీసుకోవడం వల్ల కొన్ని మనుషుల ఆకలి తీరడంతో పాటు సరైన శక్తి లభించి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కానీ ప్రస్తుత కాలంలో ఇవి నాణ్యతను కోల్పోతున్నాయి. వీటిలో ప్రోటీన్లకు బదులు కార్బోహైడ్రేట్ల శాతం పెరిగిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో వినియోగించే ఈ ఉత్పత్తుల ద్వారా అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని Indian Council of Medical Research (ICMR) హెచ్చరిస్తోంది. బియ్యం, గోధుమలు ఎక్కువగా వినియోగించడం వల్ల డయాబెటిస్, బరువు పెరగడం, గుండె సమస్యలు వంటివి త్వరగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. సాధ్యమైనంతవరకు వీటిని దూరంగా ఉంచాలని.. వాటి స్థానంలో ప్రోటీన్లను కలిగిన ఆహార పదార్థాలను చేర్చుకోవాలని తెలుపుతోంది. దీనికి సంబంధించిన పరిశోధన వివరాలను తాజాగా బయటపెట్టింది.
ICMR తాజాగా భారత దేశంలో డయాబెటిక్ వ్యాధిపై పరిశోధనలు నిర్వహించింది. ఇందులో 83 శాతం మంది నడివయస్కులు ప్రమాదకరమైన వ్యాధులు కలిగి ఉన్నారని పేర్కొంది. ఇవి సాంప్రదాయ ఆహారాలు తినేవారిలోనే ఉన్నట్టు గుర్తించారు. 40 సంవత్సరాల వయసు ఉన్న పురుషులు, స్త్రీలను కలిపి మొత్తం 18,090 మందిని ఈ పరిశోధనలోకి తీసుకున్నారు. వీరిలో మూడింట ఒక వంతు వారికి అధిక రక్తపోటు సమస్య ఉన్నట్లు గుర్తించారు. మిగతా వారికి టైప్ టు డయాబెటిస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే భవిష్యత్తులో మధుమేహం వ్యాధి పెరిగే అవకాశం ఉందని గుర్తించారు. అలాగే భారతదేశ సగటు శరీర ద్రవ్యరాశి సూచిక 22.2 మద్యస్థంగా ఉన్నప్పటికీ.. 43 శాతం మంది అధిక బరువుతో.. 26% మంది ఉబకాయంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. భారతదేశ జనాభాలో 36 శాతం మంది నడుము చుట్టూ ఉండే కొవ్వులు కలిగి ఉన్నట్లు.. ఇది ఆరోగ్యానికి హానికరము అని ఐసిఎంఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు.
అయితే ఈ సమస్యలు రావడానికి ప్రతి రోజు తీసుకునే ఆహార పదార్థాలే కారణమని అంటున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ శాతం మంది శుద్ధిచేసిన బియ్యం, గోధుమలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇవి తక్కువ నాణ్యతతో ఉంటున్నాయి. ఇందులో రొటీన్ల శాతం తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తక్కువ కార్బోహైడ్రేట్లు తినే వారితో పోలిస్తే ఎక్కువ కార్బోహైడ్రేట్లు తినేవారిలోనే టైప్ టు డయాబెటిస్ 30% ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఫ్రీ డయాబెటిస్ 20%, ఉబకాయం 22 శాతం, ఉదర ఉబకాయం 22% ఎక్కువగా ఉంది. బియ్యం, గోధుమల్లో గతంలో కంటే ఇప్పుడు నాణ్యత తగ్గిందని.. ఇందులో కార్బోహైడ్రేట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ అవి ఆరోగ్యానికి హానికరం గానే ఉంటున్నట్లు తెలుపుతున్నారు.
ఈ తరుణంలో భారతీయులు ఎక్కువగా ప్రోటీన్ల శాతం తీసుకునే ఆహారం తీసుకోవడం అవసరం ఏర్పడిందని ఐసిఎంఆర్ నిపుణులు తెలుపుతున్నారు. ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, చేపలు వంటి ప్రోటీన్లు కలిగిన వాటిని తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ను 9 నుంచి 11 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే వీటిని ఎక్కువగా వినియోగించేవారు ఫ్రీ డయాబెటిస్ నుంచి 6 నుంచి 11 శాతం దూరంగా ఉన్నట్లు కనుక్కున్నారు. ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే కార్బోహైడ్రేట్ల శాతం తగ్గించాలని.. అందులోనూ బియ్యం, గోధుమలు వంటి సాంప్రదాయ ఉత్పత్తులను తక్కువగా వినియోగించాలని తెలుపుతున్నారు. వీటి స్థానంలో ప్రోటీన్లు కలిగిన ఆహారం తీసుకొని భర్తీ చేయాలని అంటున్నారు.