Rajgira health benefits: మానవ శరీర ఆరోగ్యానికి ప్రోటీన్ల ఆహారం తీసుకోవాలని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ప్రోటీన్ల ఆహారం అనగానే రాగి జావా.. తృణ ధాన్యాలు.. మునగ.. వంటివి చెబుతారు. వీటివల్ల శరీరంలో కావాల్సిన దానికంటే ఎక్కువగా ప్రోటీన్లు అందుతాయని అంటూ ఉంటారు. అయితే వీటి కోవాలనే కొత్తగా రాజ్ గిరా.. మీరు ఎక్కువగా వినిపిస్తుంది. మిల్లెట్ గ్రూప్ కు చెందిన ఈ ధాన్యం మొక్కజొన్న కంటే ఎక్కువ శక్తిని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. భారతదేశంలో ఉత్తరాదిన దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా పూజ సమయంలో అదనపు శక్తి కోసం దీనిని తీసుకుంటూ ఉంటారు. ఉపవాస వేళ రాజ్ గిరా మాత్రమే తీసుకొని ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండగలుగుతారు. అయితే ఈ రాజ్ గిరా వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
అచ్చం తోటకూర లాగా ఉండే ఈ పదార్థం అమరాంద్ గ్రెయిన్ లేదా తోటకూర విత్తనాలు అని అంటారు. వేలవేల సంవత్సరాల నుంచి వీటిని తీసుకుంటున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఇతర ధాన్యాలతో పోలిస్తే వీటిలో లైసిన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. 100 గ్రాముల రాజ్ గిరా పదార్థంలో 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు షుగర్ శాతాన్ని నియంత్రిస్తుంది. అన్నిటికి మించి ఇందులో గ్లూటెన్ ఎక్కువగా ఉండదు కాబట్టి.. మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా దీని పిండితో చేసిన రోటి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ శక్తి వస్తుంది.
రాజ్ గిరాలో పీచు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే ఇందులో బి విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. మహిళలు ఎక్కువగా వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అంతేకాకుండా వారు మోనోపాజ్ తర్వాత వచ్చే ఆస్టియోపొరోసిస్ ను నివారించవచ్చు. వీడిలోని పోలేట్ అనే పదార్థం గర్భిణులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే జుట్టు రాలే సమస్య ఉన్నవారు సైతం వీటిని తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడం ద్వారా హృద్రోగ సమస్యలు ఉన్నవారికి ఇవి చాలా మంచిది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు సైతం వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.
రాజ్ గిరా తో అనేక రకాల ఆహార పదార్థాలను చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించి ఉప్మా, కిచిడి, లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఈ పదార్థాన్ని ఎక్కువగా బేకరీలలో ఉపయోగిస్తారు. మొలకెత్తిన అమరాన్ లో పోషకాల శాతం మరింత ఎక్కువగా. అందువల్ల దీనిని ఉడికించి ఉప్పు, మిరియాలు వంటివి జోడించి అల్పాహారంగా తీసుకోవచ్చును.రాజ్ గిరా మొలకల పిండి కూడా మార్కెట్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. వరి, గోధుమ, వంటి వాటితో మరమరాలు చేస్తున్నారు. ఇన్ని రకాలుగా ఉపయోగపడటం వల్ల దీనిని ప్రత్యేకంగా తీసుకోవాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారు.