https://oktelugu.com/

Pregnancy: ఈ లోపం ఉందా.. అయితే మీకు ప్రెగ్నెన్సీ కావడం కష్టమే!

కొందరు మహిళలకు ఓ లోపం వల్ల కూడా ప్రెగ్నెన్సీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా విటమిన్ డి లోపం వల్ల అసలు ప్రెగ్నెన్సీ తొందరగా రావడం లేదు. ఈ లోపం ఉంటే మహిళలు గర్భం దాల్చడం కష్టమా? ఈ లోపం తగ్గాలంటే ఏం చేయాలో మరి ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

Written By: , Updated On : December 13, 2024 / 04:14 AM IST
pregnancy

pregnancy

Follow us on

Pregnancy: తల్లి కావడం అనేది గొప్ప వరం. చాలా మంది ఈ రోజుల్లో సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలామంది జంటలు ఈ రోజుల్లో సంతానలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పెళ్లయిన వెంటనే ప్రెగ్నెన్సీ వద్దని లేటు చేస్తున్నారు. కానీ ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కావాలన్న రావడం లేదు. దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇవే కాకుండా శరీరంలో కొన్ని హార్మోన్ల లోపం వల్ల కూడా కొందరు గర్భం దాల్చడం లేదు. అలాగే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో కొందరు శృంగారానికి దూరంగా ఉంటున్నారు. వీటితో పాటు ఇప్పుడున్న ఉన్న జీవనశైలి, ఆహారంలో మార్పులు, పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా చాలా మంది మహిళలు గర్భం దాల్చడం లేదు. సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు వస్తున్నాయి. దీంతో సంతాన సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అయితే కొందరు మహిళలకు ఓ లోపం వల్ల కూడా ప్రెగ్నెన్సీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా విటమిన్ డి లోపం వల్ల అసలు ప్రెగ్నెన్సీ తొందరగా రావడం లేదు. ఈ లోపం ఉంటే మహిళలు గర్భం దాల్చడం కష్టమా? ఈ లోపం తగ్గాలంటే ఏం చేయాలో మరి ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

కొందరు మహిళలు పోషకాలు ఉండే ఆహారం తీసుకోరు. దీనివల్ల వారిలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. మహిళలకు ఈ విటమిన్ చాలా ముఖ్యమైనది. విటమిన్ డి లేకపోతే శరీరంలో కాల్షియం పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో కండరాలు బలహీనం అవుతాయి. అప్పుడు రోగనిరోధక శక్తి తొందరగా తగ్గిపోతుంది. దీనివల్ల గర్భం దాల్చడం కష్టం అవుతుంది. ఒక వేళ గర్భం దాల్చిన కూడా గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లోపం వల్ల గర్భిణులు కొన్నిసార్లు డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ డి అనేది కేవలం ఆహారం వల్ల మాత్రమే కాదు. సూర్యరశ్మి లేకపోవడం వల్ల కూడా వస్తుంది. గర్భిణులు ఉదయం సమయాల్లో ఒక 15 నిమిషాల పాటు సూర్యరశ్మిలో ఉండాలి. అప్పుడే వారి బాడీకి విటమిన్ డి అందుతుంది. కనీసం 5 నిమిషాలు అయిన ఉండాలి. లేకపోతే విటమిన్ డి లోపం వచ్చేస్తుంది.

గర్భిణులు డైలీ పోషకాలు ఉండే ఫుడ్ తినాలి. వీటితో పాటు తినే ఫుడ్‌లో విటమిన్ డి ఉండేలా చూసుకోవాలి. చేపలు, పుట్టగొడుగులు, తృణధాన్యాలు, పాలు, పెరుగు వంటివి తీసుకోవాలి. వీటితో పాటు నారింజ పండ్లు, గుడ్లు, ఓట్స్ వంటి వాటిలో కూడా విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. డైలీ లైఫ్‌లో వీటిని తినడం వల్ల తొందరగా ప్రెగ్నెన్సీ రావడంతో పాటు గర్భం దాల్చిన కూడా ఆరోగ్యంగా ఉంటారు. మీతో పాటు కడుపులో ఉండే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.