Insurance: జీవితంలో అనారోగ్య సమస్యలు రావడం, ప్రమాదాలకు గురికావడం కామన్. అయితే పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రి బిల్లులు భరించాలంటే కష్టం. ఇలాంటి సమయాల్లో ఉపయోగపడేందుకు కొందరు బీమాలు తీసుకుంటారు. బీమాలు తీసుకోవడం వల్ల ఎప్పుడైనా ఏదైనా సమస్య జరిగితే సాయంగా ఉంటుంది. కొందరు ఇంట్లో ఒక్కరే సంపాదిస్తారు. కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోనిది జరిగితే ఆ కుటుంబమంతా రోడ్డున పడుతుంది. ఈ క్రమంలోనే ఒక బీమా పాలసీ ఉంటే ఎలాంటి సమస్య వచ్చిన అవి ఉపయోగపడతాయి. కుటుంబ పెద్దకు ఏదైనా అయిన కూడా ఆ డబ్బు కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది. ప్రతీ ఒక్కరూ కూడా బీమా తీసుకోవాలి. దీనివల్ల కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇవన్నీ ఆలోచించే కొందరు బీమా తీసుకుంటారు. తీసుకునే ముందు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అయితే బీమా తీసుకునే ముందు ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆ విషయాలు ఏంటో చూద్దాం.
బీమాను మొదట అర్థం చేసుకోండి
బీమాలో చాలా రకాలు ఉంటాయి. ఒక్కో పాలసీ రూల్స్ ఒక్కోలా ఉంటాయి. మీరు తీసుకునే పాలసీ పూర్తి వివరాలు, డిటైల్స్ అన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోండి. బీమాలో మీరు నెలకు, మూడు నెలలకు, ఏడాదికి ఇలా ఉంటాయి. మీకు ఏది కంఫర్ట్ అయితే అది కట్టుకోవచ్చు.
ఎంత బీమా కట్టాలి
మీరు ఎంత బీమా పెట్టాలని అనుకుంటున్నారో.. దాని బట్టి నెలకు కట్టాలి. అయితే మీరు తక్కువగా పెట్టాలనుకుంటున్నారా.. ఎక్కువ పెట్టాలని అనుకుంటున్నారా అనేది ముందే డిసైడ్ అవ్వండి. అలాగే మీరు కట్టే బీమా బట్టే తర్వాత డబ్బు వస్తుంది.
రక్షణ ఉందా? లేదా?
మీరు కట్టే బీమా సరైనదా? లేదా? అనేది చెక్ చేసుకుని కట్టండి. కొన్ని మోసం చేసేవి ఉంటాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో బీమా కట్టాలని ప్లాన్ చేస్తే జాగ్రత్తగా చూసుకోండి. తొందర పడి తక్కువగా ఉందని బీమా ప్లాన్ చేయవద్దు. అలాగే ఏజెంట్లకు నేరుగా డబ్బు ఇవ్వద్దు. మీరే బీమా కార్యాలయానికి వెళ్లి చెల్లించండి. అలాగే బీమా కట్టిన రసీదులు పడేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి.
వివరాలు చెప్పవద్దు
మీరు బీమాకి ప్లాన్ చేస్తే అన్ని విషయాలు ఇతరులకు చెప్పవద్దు. పాన్ కార్డు, పాలసీ వివరాలు ఇతరులకు చెబితే వారు మీకు తెలియకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాలసీలు క్యూఆర్ కోడ్‌తో వస్తున్నాయి. వీటివల్ల ఈజీగా మోసం చేసేస్తారు. అలాగే పాలసీల మీద సంతకం చేసే ముందు నిబంధనలు అన్ని చూసి చేయండి.
సూచనలు తీసుకోండి
బీమా గురించి తెలియకపోతే మీకు తెలియకపోతే ఇతరులను అడిగి తెలుసుకోండి. ఏ బీమా మంచిది? ఎంత కడితే బెటర్? ఏది నమ్మశక్యమైనది? అనే విషయాలు తెలుసుకున్న తర్వాత బీమా తీసుకోవడానికి ప్లాన్ చేయండి. మీ కుటుంబ సభ్యులు లేదా తోటి వారిని అడిగి తెలుసుకోవడం మంచిది.