Pista Benefits: ఆరోగ్యమే మహా బలం. ప్రస్తుత జీవనశైలి వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అంతే కాదు జీవిత కాలం కూడా మరింత తగ్గింది. అందుకే ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అంటారు వైద్యులు. ఆహారం వల్ల మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. పోషకాహారం వల్ల శరీరానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అంతేకాదు విటమిన్లు, ప్రోటీన్లు ఉన్న ఫుడ్ ను కూడా తీసుకోవాల్సిందే. అయితే కాస్త ధర ఎక్కువ అయినా కూడా పిస్తా తింటారు చాలా మంది మరి దీని వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసా?
పిస్తా అనేది డ్రై నట్ అనే విషయం తెలిసిందే. ఇది శరీరానికి ఇన్ఫెక్షన్ ల నుంచి రక్షిస్తుంది.ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్ ఏ,కె, సి, బి-6, డి, ఇ లు పుష్కలంగా ఉంటాయి. మిగతా వాటికంటే ఇందులోనే అధిక ప్రోటీన్లు ఉంటాయట. అందుకే ఈ పిస్తాను రోజు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నుంచి తప్పించుకోవచ్చు. కొలెస్ట్రాల్, ఊబకాయం కూడా అదుపులో ఉంటాయి.
సాయంత్రం వేల కొన్ని పిస్తా గింజలు తింటే పురుషులకు శృంగార శక్తి మరింత పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.ఎముకల్లో పటుత్వం తక్కువ ఉన్నవారు ప్రతి రోజు రాత్రి మరవకుండా పిస్తాలను తింటే మంచి ఫలితాలు వస్తాయి.అంతేకాదు రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది పిస్తా. పిస్తా లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటికి ఎంతో మేలు చేస్తాయట.
రోజు 5 పిస్తాలను తినడం వల్ల జ్ఞాపకశక్తి మరింత పెరుగుతుందట. అంతేకాదు దీని వల్ల అలసటకు చెక్ పెట్టవచ్చు.మంచి బలం కూడా చేకూరుతుంది. క్రమం తప్పకుండా పిస్తాను డైట్ లో చేర్చుకుంటే అధిక బరువు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.ఇది నైట్రిక్ ఆక్సైడ్ మారినప్పుడు రక్తనాళాలను విస్తృతం చేస్తుంది.