Star Directors: సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అనగానే వాళ్ళు తీసిన సూపర్ హిట్ సినిమాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అయితే చాలామంది దర్శకులు వాళ్ళ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్స్ ని అందుకున్నారు. చాలామంది స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశాలను అందుకున్నారు. ఇక ఇది ఇలా ఉంటే కొంతమంది స్టార్ డైరెక్టర్స్ వాళ్ల కెరియర్ లో తీసిన వరస్ట్ సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం…
త్రివిక్రమ్ శ్రీనివాస్
త్రివిక్రమ్ రైటర్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో చాలా వరుస విజయాలను అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. ఇక దర్శకుడుగా మారి ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను కూడా సాధించడమే కాకుండా స్టార్ హీరోలు కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి సినిమా ఆయన కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలింది…
హరీష్ శంకర్
హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా మిరపకాయ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే మరొక సినిమా కూడా చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఆయన ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి చేసిన ‘రామయ్య వస్తావయ్య ‘ సినిమా భారీ డిజాస్టర్ అయింది.ఇక హరీష్ శంకర్ కెరియర్ భారీ డిజాస్టర్ గా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయింది…
శ్రీను వైట్ల
శ్రీను వైట్ల చాలా మంచి సినిమాలు తీసి సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. కానీ ఆయన చేసిన సినిమాల్లో దూకుడు సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టగా, మిగిలిన సినిమాలు అన్నీ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఆయన కెరియర్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘ ఆగడు’ సినిమా మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లో కూడా భారీ డిజాస్టర్ గా మిగలడం తో మరోసారి శీను వైట్ల దర్శకత్వంలో నటించడానికి మహేష్ బాబు ఆసక్తిని చూపించలేకపోతున్నాడు…