Piles : ఫైల్స్.. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్న ఈ ఆరోగ్య సమస్యకు కొన్ని చిట్కాలతో పరిష్కారాన్ని చూపించవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ సమస్య వల్ల ఉత్పన్నమయ్య ఇబ్బందులను చిన్నపాటి చిట్కాలతో తొలగించుకోవచ్చు.
పైల్స్.. మూలశంక.. పేరు ఏదైనా.. ఏ భాషలో చెప్పిన ఈ సమస్య వచ్చిందంటే అప్పుడు పడే బాధ ఎలాంటిదో అది మాటల్లో చెప్పలేం. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడల్లా టాయిలెట్లో నరకయాతన అనుభవించాల్సిందే. అనంతరం కూడా మంట, నొప్పితో సతమతం అవ్వాల్సిందే. అయితే, ఫైల్స్ అనేవి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మలబద్ధకం, థైరాయిడ్, డయాబెటిస్, మాంసం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఎక్కువగా కూర్చుని ఉండడం.. వంటివి దాని వెనుక ఉన్న కొన్ని కారణాలు. అయితే ఇవన్నీ మనకు తెలిసిన కారణాలు కాగా తెలియని ఎన్నో ఉన్నాయి. అయితే ఏ కారణం వల్ల ఫైల్స్ వచ్చిన అవి ఓ పట్టాన మానవు. ఈ క్రమంలో కింద ఇచ్చిన కొన్ని చిట్కాలను పాటిస్తే ఫైల్స్ నుంచి విముక్తి పొందేందుకు అవకాశం ఉంది. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా చేస్తే ఎంతో మేలు..
ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకొని అందులో కొన్ని బిర్యాని ఆకులు, మూడు వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అనంతరం ఆ నీటిని పది నిమిషాలు పాటు బాగా మరిగించాలి. ఈ మిశ్రమం మరిగాక దాన్ని చల్లార్చి సమస్య ఉన్న ప్రదేశం లో రాయాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తుంటే ఫైల్స్ బాధించవు. చమోమిల్ (తెల్ల చామంతి) ఫోన్ తీసుకుని దాన్ని నీటిలో వేసి డికాషన్ కాయాలి. ఆ డికాషన్ ను చల్లార్చి సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తే ఫలితం ఉంటుంది. చిన్న గ్లాసులో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అందులో కొన్ని కాటన్ బాల్స్ వేసి నానబెట్టాలి. కొద్దిసేపు ఆగాక వాటిని తీసి సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తే ఫైల్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
కలబంద ఆకులతో ఈ పని..
కలబంద ఆకులను తీసుకొని వాటిని మధ్యలోకి చీల్చి వాటి నుంచి గుజ్జుని సేకరించాలి. దాని ఫైల్స్ పై అప్లై చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి అందులో కొద్దిగా అల్లం రసం, తేనే కలిపి ఆ మిశ్రమాన్ని ఫైల్స్ పై రాయాలి. దీంతో వాటి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను ఒక గిన్నెలో తీసుకొని అందులో కాటన్ బాల్స్ నుంచి సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. దీంతో ఫైల్స్ బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నందున ఇది ఫైల్స్ కు తక్షణ ఉపశమనంగా పనిచేస్తుంది. టీ ట్రీ ఆయిల్ ను ఆముదం లేదా బాదం నూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని ఫైల్స్ పై రాస్తూ ఉండాలి. దీంతో కొద్దిరోజుల్లోనే ఫైల్స్ తగ్గిపోతాయి.
పెరుగుతున్న ఫైల్స్ బాధితులు..
గత కొన్ని ఏళ్లుగా ఫైల్స్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా 30 ఏళ్ల లోపు యువతలో ఈ సమస్య ఎక్కువ అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు నిమిత్తం బయట ఉండడం.. సమయానికి తినకపోవడం, బయట ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం, ముఖ్యంగా ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో యుక్త వయసు వారిలో ఈ సమస్య పెరుగుతోంది. ఒకసారి ఈ సమస్య బారిన పడిన వాళ్ళు ఏళ్ల తరబడి ఇబ్బందులను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
పరిష్కార మార్గాల కోసం వెతుకులాట..
ఫైల్స్ బారిన పడినవారు ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. అయితే ఏ మార్గంలోనూ సరైన పరిష్కారం లభించకపోవడంతో బాధితులు తీవ్రంగానే ఇబ్బంది పడుతుంటారు. ఫైల్స్ వల్ల రోజువారి చేసుకునే సాధారణ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి చాలా మందికి ఉంటుంది. ఎక్కువ దూరం పాటు బండి డ్రైవ్ చేయలేకపోవడం, గంటలు తరబడి కూర్చొని పనిచేయలేకపోవడం, ఇరిటేషన్ వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. ఈ సమస్యలకు పైన పేర్కొన్న చిట్కాలతో కొంత ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.