IPL Mega Auction: ఈ వ్యవహారం కొనసాగుతుండగానే ఆకస్మాత్తుగా కేంద్ర దర్యాప్తు విభాగమైన ఎన్ ఫోర్స్ మెంట్ ఎంట్రీ ఇచ్చింది.. అనధికారికంగా క్రికెట్ మ్యాచ్ లు ప్రసారాలు చేసిన వారిపై సోదాలు నిర్వహించింది. ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడిన ఫ్లాట్ ఫామ్ “పెయిర్ ప్లే” సంస్థపై దాడులు చేసింది. మంగళవారం ఏకకాలంలో ముంబై తో పాటు గుజరాత్ రాష్ట్రంలోని కచ్, దేశంలోని వివిధ ప్రాంతాలలో సోదాలు చేసింది. ఈ సోదాలలో నాలుగు కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశామని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటించారు.. ఇటీవల పెయిర్ ప్లే సంస్థ వ్యవహార శైలిని జియో సినిమా మాతృ సంస్థ అయిన వయా కాం 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ముంబైలోని నోడల్ సైబర్ పోలీసులు దృష్టికి తీసుకెళ్ళింది. సవివరమైన ఆధారాలతో ఫిర్యాదు చేసింది. పెయిర్ ప్లే సంస్థ వల్ల 100 కోట్ల నష్టం వాటిల్లిందని వయాకాం తన ఫిర్యాదులో వివరించింది.. పెయిర్ ప్లే నిబంధనలు మొత్తం ఉల్లంఘించిందని వయాకాం పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. వయాకాం చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఆ తర్వాత సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం -2002 ప్రకారం నాలుగు కోట్ల విలువైన నగదు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అనేక పత్రాలను జప్తు చేసింది.
దుబాయ్ లో కంపెనీల రిజిస్ట్రేషన్..
పెయిర్ ప్లే లో క్రిష్ లక్ష్మి చంద్ షా కీలక వ్యక్తిగా ఉన్నాడు. ఆయన దుబాయ్ తో పాటు ఇతర దేశాలలో కంపెనీలను రిజిస్టర్ చేశాడు. ఈ విషయం ఈడీ దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటివరకు మూడుసార్లు సోదాలను నిర్వహించింది. తాజాగా నాలుగోసారి కూడా తనిఖీలు జరిపింది. జూన్ 12, ఆగస్టు 27, సెప్టెంబర్ 27 తేదీలలో ఈడీ సోదరులు జరిపింది. అప్పుడు 113 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసింది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు 117 కోట్లను తన ఆధీనంలోకి తీసుకుంది. పెయిర్ ప్లే సాగించిన అక్రమాలను బయట పెట్టడం, చట్ట వ్యతిరేకంగా సాగుతున్న బెట్టింగ్, ఇతర చీకటి వ్యవహారాల గుట్టు ఇప్పడమే లక్ష్యంగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
క్రికెట్ సీజన్లో..
ఐపీఎల్, వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ జరిగే సమయంలో బెట్టింగ్ జోరుగా సాగుతుంది. అయితే ఇప్పుడు కూడా వరుసగా టోర్నీలు ఉన్న నేపథ్యంలో క్రికెట్ సీజన్ ఉత్సాహంగా సాగుతోంది. ఈ టోర్నీలలో ఆధారంగా చేసుకొని అక్రమార్కులు బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఏకంగా ఒక కంపెనీని రిజిస్టర్ చేసి పై విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ వ్యవహారాలు తమదాకా రావడంతో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఇది ఒక రకంగా జూదగాళ్లకు కోలు కోలేని షాక్ అని చెప్పవచ్చు.. ఎందుకంటే అనధికార సంస్థలు బెట్టింగ్ పేరుతో అమాయకుల జేబులకు కత్తెర వేస్తున్నాయి. అడ్డగోలు దందాలతో క్రికెట్ అభిమానులను ముంచేస్తున్నాయి. ఇలాంటి బెట్టింగ్ సంస్థల వ్యవహారాల వల్లే చాలామంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి ఇప్పటికైనా ఇలాంటి వ్యవహారాలు కనుమరుగు కావాలని ఆశిద్దాం.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: In a few days ipl mega auction enforcement entry in this time seizure of properties in many places what happened so far
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com