Phone View Problems: ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు మొబైల్ ప్రధాన వస్తువుగా మారిపోయింది. ఇంట్లో నుంచి కార్యాలయ అవసరాల వరకు ఫోన్ లేకుండా గడవడం లేదు. అయితే ఫోన్ మాయలో పడి చాలామంది తమ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు అవసరాల కోసం మొబైల్ యూస్ చేస్తే.. మరికొందరు కాలక్షేపం కోసం ఎప్పటికీ చేతిలో ఫోన్ పట్టుకునే ఉంటున్నారు. అయితే ఫోన్ చూసేటప్పుడు ఎవరైనా చేతిలో పట్టుకొని మెడను వంచి చూస్తారు. మరికొందరు చైర్ లో కూర్చుని పైకెత్తి చూస్తారు. అసలు ఫోన్ ఎలా చూడడం మంచిది? వంగి చూడడం వల్ల ఏం జరుగుతుంది..
స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాకుండా సమాచారం, ఫోటోలు, వీడియోల కోసం మొబైల్ ను తప్పనిసరిగా వాడుతున్నారు. ఈ క్రమంలో రెండు చేతుల లో మొబైల్ పట్టుకొని మెడను మంచి చూడాల్సివస్తుంది. అయితే ఇలా మెడలు వచినప్పుడు మెడపై ఒత్తిడి ఒక్కసారిగా పెరుగుతుంది. సాధారణంగా తల బరువు 5 నుంచి 6 కిలోల వరకు ఉంటుంది. ఈ తల 30 నుంచి 60 డిగ్రీల వరకు వంగితే 20 నుంచి 27 కిలోల బరువు మెడపై పడుతుంది. దీంతో మెడనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్పాండిలైటిస్ వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.
తలను ముందుకు వంచి మొబైల్ చూడడం వల్ల భుజాలు ముందుకు వాలిపోతాయి. దీంతో వెన్నెముకపై ప్రభావం పడుతుంది. దీర్ఘకాలికంగా ఇలాగే చూడడం వల్ల అప్పర్ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ వస్తువు వెన్నెముక ఆకృతి మారే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు మేడం వంచి మొబైల్ చూడడం వల్ల తలనొప్పి తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇది మైక్లైన్ కు దారితీస్తుంది. అలాగే ఫోన్ పై అత్యధిక రంగులు ప్రచారం అవుతాయి. దీంతోపాటు బ్రైట్నెస్ ఎక్కువగా ఉండే ఫోన్ ను చూడడం వల్ల కళ్ళపై తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. ఆ తర్వాత కంటి నుంచి మంట ఏర్పడుతుంది. అనుకోకుండానే కళ్ళ నుంచి నీళ్లు రావడం వంటివి జరుగుతాయి. ముందుకు వంగి ఫోన్ చూడడం వల్ల చాతి కుదించబడుతుంది. దీంతో శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. అలాగే మానసికంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే ప్రతి అవసరానికి ఫోన్ తప్పనిసరిగా మారడంతో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఫోన్ ను చూడాలి. రెండు చేతులు పైకి ఎత్తి కళ్ళ వద్దకు తీసుకువచ్చి చూడాలి. తలను వంచే ప్రయత్నం చేయొద్దు. కుర్చీలో వాంగి కూర్చోకుండా నిటారుగా కూర్చోవాలి. భుజాలు ముందుకు వాల్చకుండా రిలాక్స్ గా ఉండాలి. అదే పనిగా ఫోను చూడకుండా ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఇతర వస్తువులను కూడా చూస్తూ ఉండాలి. మొబైల్ చూస్తున్నప్పుడు చుట్టుపక్కల వెలుతురు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మొబైల్ లో ఆటో స్క్రీన్ బైక్ నెస్ పెట్టుకోవడం మంచిది. ఇది వాతావరణానికి అనుకూలంగా బ్రైట్నెస్ వస్తుంది.