మరో రెండు రోజుల్లో రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజ్ సాబ్'(The Rajasaab Movie) చిత్రం విడుదల కాబోతుంది. అదే విధంగా 5 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad garu) చిత్రం కూడా విడుదల కాబోతుంది. ‘రాజా సాబ్’ చిత్రాన్ని 350 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిస్తే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని 200 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించారు. ఈ రెండు సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచి, భారీ వసూళ్లను రాబట్టి, బయ్యర్స్ కి లాభాలను తెచ్చిపెట్టాలంటే, కచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ ఉండాల్సిందే. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీ కి అనుకూలమే. టికెట్ రేట్స్, ప్రీమియర్ షోస్ ఇలా నిర్మాతలు ఏది కోరితే అది ఇవ్వడానికి రెడీ గా ఉంటారు.
కానీ ఈ సినిమాల విడుదల సమయం లో ఎవరో ఒకరు వచ్చి హై కోర్టు లో కేసు వేయడం, విచారణ జరిపిన తర్వాత హై కోర్టు ప్రభుత్వాన్ని టికెట్ రేట్స్ జీవో ని వెనక్కి తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం వంటివి జరుగుతుండం ఓజీ నుండి చూస్తూనే ఉన్నాం. కేవలం తీర్పు వచ్చేంత వరకే ప్రీమియర్ షోస్ అయినా, టికెట్ రేట్స్ అయినా జీవో ప్రకారం కొనసాగుతాయి. తీర్పు వచ్చిన తర్వాత మామూలు రేట్స్ మీదనే రన్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా విడుదలయ్యే ముందు కచ్చితంగా ఎవరో ఒకరు కేసు పెడతారనే విషయాన్నీ ముందుగానే పసిగట్టారు మేకర్స్. అందుకే హై కోర్టు ని ఆశ్రయించి టికెట్ రేట్స్ పెంచాల్సిందిగా అనుమతి కోరుతూ పిటీషన్ పెట్టుకున్నారు. దీనిపై నేడు తీర్పు రానుంది.
మా రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కినవి కాబట్టి, రెండిటికి టికెట్ హైక్స్ కావాలని, దయచేసి మాపై దయచూపించండి అని అడగబోతున్నారు. మరి కోర్టు వీళ్ళ రిక్వెస్ట్ ని అంగీకరించి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. ఇకపోతే రెండు సినిమాలకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైంది. చూడాలి మరి ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అనేది మరో 5 రోజుల్లో తేలనుంది .