Parenting Tips: మీకు అబ్బాయి ఉన్నాడా.. అయితే కచ్చితంగా నేర్పించాల్సిన అలవాట్లు ఇవే!

Parenting Tips: చాలామంది తల్లిదండ్రులు అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు స్వేచ్ఛ ఎక్కువగా ఇస్తారనే సంగతి తెలిసిందే. అయితే తల్లిదండ్రులు కొన్ని విషయాలను అబ్బాయిలకు చెప్పడంతో పాటు కొన్ని అలవాట్లను కచ్చితంగా నేర్పించాలి. అబ్బాయిలకు గదులను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు గోర్లను కత్తిరించుకోవడం నేర్పిస్తే మంచిది. ఇతరులకు సాయం చేసే విషయంలో అబ్బాయిలను ప్రోత్సహించాలి. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా తల్లిదండ్రులతో పంచుకునేలా ప్రోత్సహించడంతో పాటు ఇతరులను ఎగతాళి చేస్తూ ఎప్పుడూ మాట్లాడకూడదని అబ్బాయిలకు సూచించాలి. పెద్దలను గౌరవించడంతో […]

Written By: Navya, Updated On : March 14, 2022 8:03 pm
Follow us on

Parenting Tips: చాలామంది తల్లిదండ్రులు అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు స్వేచ్ఛ ఎక్కువగా ఇస్తారనే సంగతి తెలిసిందే. అయితే తల్లిదండ్రులు కొన్ని విషయాలను అబ్బాయిలకు చెప్పడంతో పాటు కొన్ని అలవాట్లను కచ్చితంగా నేర్పించాలి. అబ్బాయిలకు గదులను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు గోర్లను కత్తిరించుకోవడం నేర్పిస్తే మంచిది. ఇతరులకు సాయం చేసే విషయంలో అబ్బాయిలను ప్రోత్సహించాలి.

Parenting Tips

జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా తల్లిదండ్రులతో పంచుకునేలా ప్రోత్సహించడంతో పాటు ఇతరులను ఎగతాళి చేస్తూ ఎప్పుడూ మాట్లాడకూడదని అబ్బాయిలకు సూచించాలి. పెద్దలను గౌరవించడంతో పాటు పెద్దలు అడిగిన ప్రశ్నలకు గౌరవంగా సమాధానాలు చెప్పేలా ప్రోత్సహించాలి. ఇతరులకు అనవసర సలహాలు ఇవ్వకూడదని ఇతరులు తప్పు చేస్తుంటే వాళ్లకు దూరంగా ఉండాలని సూచించాలి.

Also Read: Bheemla Nayak Collections: ‘పవన్’ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది !

అహంకారంతో ప్రవర్తించడం వల్ల శత్రువులు పెరుగుతారని చెప్పాలి. ఎలాంటి పరిస్థితిలో అయినా అబద్ధం చెప్పకూడదని వెల్లడించాలి. చదువు విషయంలో కెరీర్ విషయంలో తీవ్రంగా శ్రమించి అనుకున్న లక్ష్యాలను సాధించాలి. పట్టుదలతో ప్రయత్నాలు చేయాలని లక్ష్యం పెద్దదైనా శ్రమిస్తే అనుకున్న ఫలితాలు దక్కుతాయని అబ్బాయిలకు సూచించాలి. ఇతరుల పట్ల దయతో వ్యవహరించాలని చెప్పాలి.

వంటలు నేర్పించడంతో పాటు వంట పాత్రలను తోమడం నేర్పించాలి. ఎప్పుడైనా ఏడ్చేంత బాధ వస్తే తమకు చెప్పాలని కొడుకులకు సూచిస్తే మంచిది. స్త్రీ విషయంలో, అక్కాచెల్లెళ్ల విషయంలో లింగ వివక్ష చూపడం సరికాదని సూచిస్తే మంచిది.

Also Read: Kiara Advani In Prabhas Movie: ప్రభాస్ సరసన కియారా అద్వానీ.. అలియానే ప్రేరణ !