https://oktelugu.com/

Papaya leaves : బొప్పాయి ఆకులతో గుండె,కాలేయం,కిడ్నీ లను 70 ఏళ్ళ పాటు ఫిట్ గా ఉంచుకోవచ్చు…ఎలాగో తెలుసా…

ఆ మొక్క బొప్పాయి.బొప్పాయిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.బొప్పాయి పండు అంటే చాలా మందికి ఇష్టం.బొప్పాయి పండు జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.అలాగే కడుపు సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.బొప్పాయి పండులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వలన అది మలబద్దకం సమస్యను నివారిస్తుంది.అయితే బొప్పాయి పండు మాత్రమే కాకుండా బొప్పాయి ఆకులతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు చెప్తున్నారు

Written By:
  • Srinivas
  • , Updated On : July 15, 2024 / 07:32 PM IST
    Follow us on

    Papaya leaves :  ప్రస్తుతం ఉన్న రోజుల్లో సామాన్యులు ఏదైనా చిన్న అనారోగ్యం తో ఆసుపత్రి కి వెళితే వేలకు వేల రూపాయలు బిల్లు చెల్లించాల్సి వస్తుంది.ఎవరైనా తీవ్ర అనారోగ్యం తో ఆసుపత్రి కి వెళితే చాలు అక్కడ నుంచి బ్రతికి బయట పడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది.కొన్ని కొన్ని సార్లు అప్పులు చేసి కూడా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.ప్రస్తుతం మారుతున్న జీవనశైలి,ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి కొత్త కొత్త అనారోగ్య సమస్యలను ఎదురుకోవలసి వస్తుంది.కొన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్స కూడా ఉండటం లేదు.ఈ క్రమం లోనే చాలా మంది జనాలు ఆయుర్వేదం,పురాతన వైద్యం చిట్కాలను పాటిస్తున్నారు.మనిషి శరీరం లో ప్రధానమైన అవయవాలలో గుండె,కాలేయం,కిడ్నీ ఉన్నాయి.ఒక మొక్క ఈ మూడు అవయవాలను 70 ఏళ్ళ పాటు ఆరోగ్యంగా ఫిట్ గా ఉంచుతుంది అని చాలా మందికి తెలియదు.ఈ అవయవాలకు ఆ మొక్క సంజీవిని లాగ పని చేస్తుంది అని చెప్పచ్చు.ఇంతకీ ఆ మొక్క ఏంటో…దాని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

    ఆ మొక్క బొప్పాయి.బొప్పాయిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.బొప్పాయి పండు అంటే చాలా మందికి ఇష్టం.బొప్పాయి పండు జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.అలాగే కడుపు సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.బొప్పాయి పండులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వలన అది మలబద్దకం సమస్యను నివారిస్తుంది.అయితే బొప్పాయి పండు మాత్రమే కాకుండా బొప్పాయి ఆకులతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు చెప్తున్నారు.బొప్పాయి ఆకులో యాంటీ ట్యూమర్ గుణాలు ఉన్నాయి.అవి కాన్సర్ ను నివారించటం లో చాలా సహాయపడతాయి.బొప్పాయి లో ఉండే ఈ యాంటీ ట్యూమర్ గుణాలు కణితులను నివారించి కాన్సర్ బారిన పడకుండా చేస్తాయి.బొప్పాయి ఆకుల రసం లో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.

    ఇది కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.బొప్పాయి ఆకుల రసం వివిధ వ్యాధులను నివారించటం లో సహాయం చేస్తుంది కాబట్టి ఈ రసాన్ని సర్వ రోగ నివారిణి అంటారు.బొప్పాయి ఆకులతో చేసిన రసం గుండె,కాలేయం,కిడ్నీ వంటి అవయవాలకు చాలా మేలు చేస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.బొప్పాయి ఆకులతో చేసిన రసం మలేరియా,డెంగ్యూ వంటి వ్యాధుల చికిత్స లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది.బొప్పాయి ఆకులతో చేసిన రసాన్ని తాగితే ప్లేట్ లెట్ కౌంట్ వేగంగా పెరుగుతుంది.అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.ఈ రసం రక్త ప్రసరణను వేగంగా మెరుగుపరుస్తుంది.గర్భాశయ,ప్రోస్టేట్,రొమ్ము,ఊపిరితిత్తుల కాన్సర్ నివారణలో బొప్పాయి ఆకుల రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.

    మలబద్దకం సమస్య ఉన్న వారికి ఈ రసం ఔషధంలా పని చేస్తుంది.ఈ రసాన్ని బేది మందు అని కూడా అంటారు.బొప్పాయి ఆకులతో చేసిన రసం శరీరం లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.బొప్పాయి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన అవి ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయ పడతాయి.గుండె,కాలేయం,కిడ్నీ లను మెరుగుపరచడంలో సహాయపడతాయి.గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఈ బొప్పాయి ఆకుల రసం చాలా సహాయపడుతుంది.అందుకే బొప్పాయి ఆకుల రసం గుండె,కాలేయం,కిడ్నీఅవయవాలకు సంజీవిని లాగ పని చేస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.అయితే మనలో చాలా మందికి బొప్పాయి పండు తినడం అంటే చాలా ఇష్టం కానీ బొప్పాయి ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని చాలా మందికి తెలియదు.మనిషి శరీరం లో ఉండే ముఖ్యమైన అవయవాలు గుండె,కాలేయం,కిడ్నీ లకు బొప్పాయి ఆకుల రసం ఔషధం లాగ పని చేస్తుంది అని మనలో చాలా మందికి తెలియదు.ఈ బొప్పాయి ఆకుల రసం తో ఎన్నో అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు.