Director Shankar: శంకర్ ప్లాప్ ల పరంపర ను అపాలంటే రామ్ చరణ్ ఒక్కడే దిక్కు అంటున్న ట్రేడ్ పండితులు…ఎందుకో తెలుసా..?

ఇక ఇదిలా ఉంటే 'రంగస్థలం ' సినిమా ముందు వరకు సుకుమార్ పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఆయన ఎన్ని సినిమాలు తీసిన సినిమాకు సక్సెస్ టాక్ వచ్చేది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం చాలా వీక్ గా ఉండేవి. అందువల్లే సుకుమార్ కు స్టార్ డైరెక్టర్ అనే ముద్ర అయితే ఉంది. కానీ కమర్షియల్ గా తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోలేకపోయాడు

Written By: Gopi, Updated On : July 16, 2024 8:15 am
Follow us on

Director Shankar :  ఒకప్పటి లెజెండరీ దర్శకుడు అయిన శంకర్ ప్రస్తుతం ప్లాపుల పరంపరను కొనసాగిస్తున్నాడు…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే శంకర్ ను ప్లాపుల నుంచి గట్టెక్కించాలంటే అది ఒక్క రామ్ చరణ్ వల్లే అవుతుందంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే మగధీర కు ముందు రాజమౌళి ఎన్ని సినిమాలు తీసిన కూడా ఆయన కెరియర్ లో ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్టు కొట్టలేకపోయాడు. ఇక రామ్ చరణ్ తో తీసిన మగధీర సినిమాతో మాత్రం అప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ గా ఉన్న ‘పోకిరి ‘ రికార్డ్ ను బ్రేక్ చేసి మరి 90 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టాడు. ఇక దాంతో రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు.

ఇక ఇదిలా ఉంటే ‘రంగస్థలం ‘ సినిమా ముందు వరకు సుకుమార్ పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఆయన ఎన్ని సినిమాలు తీసిన సినిమాకు సక్సెస్ టాక్ వచ్చేది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం చాలా వీక్ గా ఉండేవి. అందువల్లే సుకుమార్ కు స్టార్ డైరెక్టర్ అనే ముద్ర అయితే ఉంది. కానీ కమర్షియల్ గా తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఇక ఎప్పుడైతే రంగస్థలం సినిమా వచ్చి నాన్ బాహుబలి ఇండస్ట్రీ కొట్టడమే కాకుండా ఈ సినిమా భారీ కలెక్షన్లను కూడా రాబట్టి మరొకసారి రామ్ చరణ్ స్టామినాను యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తెలిసేలా చేసింది.

ఇక ఈ రెండు సినిమాలతో ఇద్దరి దర్శకులను స్టార్లుగా మార్చిన రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ ని కూడా అదే బాటలో స్టార్ గా మార్చే అవకాశాలైతే ఉన్నాయంటూ ఈ సినిమా మీద అయితే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే శంకర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి కావచ్చింది.

ఇక రీసెంట్ గా భారతీయుడు 2 సినిమాని రిలీజ్ చేసిన శంకర్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా మీద ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ సాధించినట్లయితే మరోసారి రామ్ చరణ్ కూడా శంకర్ ని స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టినవాడు అవుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…నిజానికి ఇప్పుడు శంకర్ తో రామ్ చరణ్ కి పని లేదు రామ్ చరణ్ తోనే శంకర్ కి పనుంది. ఇక శంకర్ కెరియర్ నిలబడాలంటే మాత్రం గేమ్ చేంజర్ సినిమా సూపర్ సక్సెస్ సాధించాల్సిందే. ఇది కనుక కొంచెం తేడా కొట్టిన కూడా శంకర్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో నుంచి తప్పుకోక తప్పదు.

కాబట్టి ఇప్పుడు ఆయన ముందు ఒక పెను సవాలైతే ఉంది. మరి ఆ సవాలును ఆయన అధిగమిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని బుచ్చిబాబు సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆయన చేసే సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న సినిమాగా ఇంతకుముందు రామ్ చరణ్ బుచ్చిబాబు క్లారిటీ అయితే ఇచ్చారు. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియాలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలవబోతున్నాడు అంటూ బుచ్చిబాబు చాలా కామెంట్లైతే చేస్తున్నాడు. ఇక ఆయన చెప్పినట్టుగానే ఈ సినిమాని భారీ రేంజ్ లో నిలబెడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…